Pawan Kalyan : గెలిచినా, ఓడినా ఆయనెప్పుడూ పవర్ స్టారే!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్… ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంటుంది. ఆ పిలుపులోనే ఒక పవర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్లన్నీ దేవాలయాలుగా మారిపోతాయి. ఎందుకంటే మిగిలిన హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్‌కి మాత్రమే భక్తులు ఉంటారు.

అతను ఒక్కోసారి ప్రశాంతతని నింపుకున్న బుద్ధుడిలా కనిపిస్తాడు, ఇంకోసారి కోపాన్ని దాచుకున్న కల్కిలా అనిపిస్తాడు..

తివిక్రమ్ చెప్పినట్టుగా వాడు ఓ ఆరడుగుల బుల్లెట్టు… ఆయన స్థాయి ఎవరెస్టు…
పవన్ కళ్యాణ్, చూసిన వెంటనే చదవాలనిపించే ఓ పుస్తకం లాంటోడు, ఎంత చదివిన ఏదో మిగిలి ఉందనిపించే మహా గ్రంథం లాంటోడు.

Pawan Kalyan : నా నాలుగో పెళ్లానివి నువ్వే..!

ఇప్పుడు అతను యుద్ధాన్ని గెలిపించే ఓ సైనికుడు,
సాయం చేయడంలో కర్ణుడు, ప్రజల కష్టాలను తీర్చడానికి అహర్నిషలు తపన పడే తాత్వికుడు..

యుద్ధంలో చంపడం కన్నా గెలవడం ముఖ్యమనుకునే అసలైన నాయకుడు.. గెలవకపోయినా న్యాయం కోసం ప్రశ్నిద్దాం అనే పోరాటయోధుడు..

అతని యుద్ధాన్ని ఎవరు ఆపలేరు,
అతని సైన్యాన్ని ఎవరు అడ్డుకోలేరు,
అతని కోపాన్ని ఎవరూ తట్టుకోలేరు,
అతని ప్రేమను ఎవరు భరించలేరు..

అందరూ సినిమాకి వెళ్లి పవన్ కళ్యాణ్‌ని చూస్తారు కానీ ఆయన అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్‌ని చూడడానికే, సినిమాకి వెళ్తారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్‌కి పెరిగిన ఆస్తుల కంటే పెరిగిన అప్పులు, ఎదురైన అవమానాలే ఎక్కువ… ఇవన్నీ నాకెందుకు ఒక్క సినిమా చేస్తే, హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఎందరో ఉన్నారు. పవన్ కళ్యాణ్, సినిమా చేస్తానంటే చాలు… ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి వాళ్లు రెఢీగా ఉంటారు. రీ-రిలీజ్‌లతోనే రికార్డు కల్లగొట్టిన చరిత్ర తనది..

అయితే ఎంతో అభిమానించి అందలమెక్కించిన అభిమానులే, గత ఎన్నికల్లో అధః పాతాళంలో పడేశారు. అయినా ఎంతటి పరాజయాన్నైనా తట్టుకొని నిలబడ్డ ధైర్యం, పవన్ కళ్యాణ్ సొంతం… తాను కావాలనుకుంటే ఇవన్నీ వదిలేసి, చల్లగా ఏసీ గదుల్లో నచ్చిన ఫుడ్డు తింటూ రిలాక్స్ అవ్వొచ్చు. కానీ జనం కోసం మండుటెండలో తిరిగాడు.. జనంలో నలిగాడు, సామాన్య జనం మధ్య మెలిగాడు. ఆయనకి ఎంత కష్టం ఉన్నా, కష్టాల్లో ఉన్న జనాన్ని చూస్తే అస్సలు తట్టుకోలేని వెన్నలాంటి మనసు తనది.

Tollywood Actors : జనసేనానికి టాలీవుడ్ సపోర్ట్.. నాని, రాజ్ తరుణ్, మెగాస్టార్‌తో పాటు..

ఆ విషయంలో ఆయన ఎవరు అందుకోలేని శిఖరం…
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కోట లేని మహారాజు,
ఎవరికి అర్థం కాని అరణ్యం,
ఒకరు గుర్తించాల్సిన అవసరం లేని అద్భుతం…

ఎన్నికల్లో ఆయన గెలిచినా, గెలవకపోయినా… ఇప్పటికీ, ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకోడానికి ప్రతీ పవర్ స్టార్ అభిమాని గర్వపడతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ అనే బ్రాండ్ ముందు ఏ ఎమ్మెల్యే పదవి అయినా, ముఖ్యమంత్రి అయినా చిన్నదే!

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post