Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు జనసేనాని. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే రెండు స్థానాల్లో కూడా ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ ఈసారి ఎంపీ స్థానానికి పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరిగినా, ఎమ్మెల్యే స్థానానికే పరిమితం కావాలని ఫిక్స్ అయ్యాడు.
Pawan Kalyan : నా నాలుగో పెళ్లానివి నువ్వే..!
‘గాజువాక నుంచి ఓడిపోతానని నాకు ముందే తెలుసు. భీమవరంలో ప్రచారం ముగిశాక అక్కడ కూడా ఓడిపోతానని అర్థమైంది. అయితే భీమవరం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. అయితే ఈసారి పిఠాపురం నుంచి పోటీచేయబోతున్నా..’ అంటూ ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలియగానే తాను కూడా అక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్ ద్వారా ప్రకటించాడు. ఆర్జీవీ ఇలాంటి సెటైర్లు, వెటకారాలు చేయడం చాలా కామన్. ఈసారి ఆర్జీవీ ట్వీట్ వ్యంగ్యంగా వేసిందా? లేక నిజంగానే పోటీ చేయబోతున్నాడా? అనేది తెలీదు. ఆర్జీవీ చాలారోజులుగా జగన్‌కి సన్నిహితంగా ఉంటున్నాడు. ఒకవేళ నిజంగా వర్మ పోటీ చేయాలని అనుకుంటే వైసీపీ సపోర్ట్ కూడా ఉంటుంది.. అయితే పిఠాపురంలో పవన్‌కి వీరాభిమానులు ఉన్నారు. కుల ఓట్లు కూడా భారీగా పడే అవకాశం ఉంది.
Pawan Kalyan : జనసేనను తాకిన సీట్ల పంచాయితీ.. పవన్ కళ్యాణ్‌పై తీవ్రమైన నెగిటివిటీ..