Pawan Kalyan : నా నాలుగో పెళ్లానివి నువ్వే..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చిన ప్రతీసారీ, మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడడం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బాగా అలవాటు. జగన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి తెలుగు దేశం పార్టీతో చేతులు కలిపిన జనసేన పార్టీ, పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 24 అసెంబ్లీ స్థానాల్లో, మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీలో దిగుతోంది.

Pawan Kalyan : జనసేన కోసం ఆస్తులు అమ్ముతున్న పవన్ కళ్యాణ్.. సింపథీ కోసమే ప్రచారమా..

తాడేపల్లి గూడెంలో జరిగిన తెలుగుదేశం-జనసేన జెండా సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జగన్ ప్రతీసారీ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. నేను ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడితే అస్సలు తట్టుకోలేడు. ఏ సభకి వెళ్లినా, ఏ సమావేశానికి వెళ్లినా పవన్ కళ్యాణ్‌కి ముగ్గురు పెళ్లాలు, రెండుసార్లు విడాకులు అయ్యాయని అంటాడు. నాకు నాలుగో పెళ్లాం కూడా ఉంది. అది జగనే.. నువ్వే నా నాలుగో పెళ్లానివి.. రా…’ అంటూ వ్యాఖ్యలు చేశాడు జనసేనాని పవన్ కళ్యాణ్..

ఈ వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Hanuma Vihari : ఆంధ్రా క్రికెట్‌లోకి రాజకీయాలు.. కొడుకు కోసం కెప్టెన్‌ని మార్చేసి..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post