‘జల్సా’ కోసం మహేష్.. ‘గుంటూరు కారం’ కి తిరిగి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Mahesh Babu

Pawan Kalyan Mahesh Babu : యూత్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరితో కలిసి ఓ మల్టీ స్టారర్ చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించినా, అవేవీ పట్టాలు ఎక్కలేదు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన ‘జల్సా’ మూవీకి మహేష్ వాయిస్ ఓవర్ అందించాడు.

సంక్రాంతి రేసు నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ అవుట్… విజయ్ దేవరకొండ మూవీ వాయిదా పడనుందా..?

‘జల్సా’ మూవీకి మహేష్ వాయిస్ చాలా ప్లస్ అయ్యింది కూడా. 15 ఏళ్ల తర్వాత మహేష్‌కి దీన్ని తిరిగి ఇచ్చేస్తున్నాడట పవన్ కళ్యాణ్. తివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ మూవీకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని ఓ క్రేజీ న్యూస్ గట్టిగా వినిపిస్తోంది.

Pawan Kalyan Mahesh Babuప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్, తన సొంత సినిమా షూటింగ్‌లను కూడా పక్కనబెట్టేశాడు. అయితే తివిక్రమ్, మహేష్ మీద ఉన్న అభిమానంతో ‘గుంటూరు కారం’ మూవీకి వాయిస్ ఓవర్ అందించడానికి ఒప్పుకున్నాడని టాక్. ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్‌కి పండగే..

చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..

ఎందుకంటే ఎన్నికల హడావుడి పెరగడంతో ‘ఓజీ’, ‘హరిహర వీర మల్లు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ షూటింగ్‌లకు హాజరుకావడం లేదు పవన్ కళ్యాణ్. దీంతో ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. మహేష్ ‘గుంటూరు కారం’మూవీలో పవన్ గాత్రం ఉంటుందో పీకే ఫ్యాన్స్ కూడా సంక్రాంతికి థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post