Pawan Kalyan : నా రెమ్యూనరేషన్ తగ్గించండి, వాళ్లకు సరైన భోజనం పెట్టండి..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానులు ఉంటారు. భక్తులు కూడా ఉంటారు. ఎందుకు పవన్ అంటే అంత క్రేజ్ అంటే వీరంతా ఆయన సినిమాలు చూసి ఫ్యాన్స్ అయిన వాళ్లు కాదు. వీరిలో చాలామంది పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, క్యారెక్టర్ చూసి అభిమానులుగా మారిన వాళ్లే ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత స్పెషల్. సీనియర్ నటుడు నాగ మహేష్, పవన్ గురించి ఓ విషయం చెప్పాడు..

‘ఓసారి అవుట్ డోర్‌లో షూటింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ మాట్లాడుకుంటూ జూనియర్ ఆర్టిస్టులు లంచ్ చేస్తున్న ప్లేస్‌కి వెళ్లారు. అక్కడ వాళ్లు తినే ఫుడ్ చూసి షాక్ అయ్యారు. వెంటనే షూటింగ్ ఆపేయమని చెప్పి, ప్రొడక్షన్ మేనేజర్‌ని పిలిచి, బయటి నుంచి లంచ్ తెప్పించారు.

Govt Schemes : పేరులో ఏముంది బ్రదర్..

తర్వాతి రోజు నిర్మాతతో మీటింగ్ పెట్టి, కావాలంటే నా రెమ్యూనరేషన్‌లో కోటి రూపాయలు తగ్గించుకోండి, కానీ నేను తినేదే వాళ్లూ తినాలి.. అని చెప్పారు. ఆ మాటలు విని, నేను షాక్ అయ్యాను.. సెట్స్‌లో ఉండే ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ దాకా అందరినీ ఒకేలా చూసే హీరో పవన్ కళ్యాణ్’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ మహేష్..

పవన్ కల్యాణ్ ఏపీ కేబినేట్‌లో డిప్యూటీ సీఎంతో పాటు పర్యావరణం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ & టెక్నాలజీ, అటవీ శాఖ మాత్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post