Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయాయి. పోలింగ్ ముగిసింది. ఇక కౌంటింగ్ ఒక్కటే మిగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీచేయడంతో ఆ నియోజికవర్గం పోలింగ్, ఏపీ పాలిటిక్స్‌లోనే హాట్ టాపిక్ అయ్యింది. పిఠాపురంలో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. పవన్ కళ్యాణ్ ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడం ఖాయమనే చెప్పాలి. మరి సినిమాల సంగతి ఏంటి?
మంగళగిరిలో కుటుంబ సమేతంగా ఓటు వేసిన పవన్ కళ్యాణ్, హైదరాబాద్‌కి తిరిగి వచ్చేశాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, కుటుంబంతో కలిసి వెకేషన్‌కి వెళ్లాలని అనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్. రిజల్ట్ తర్వాత జూన్‌లో పవన్ కళ్యాణ్, షూటింగ్‌లకి తిరిగి వస్తాడని అనుకుంటున్నారు. జూన్‌లో ‘OG’ షూటింగ్ పూర్తి చేసేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది..
Pawan Kalyan : గెలిచినా, ఓడినా ఆయనెప్పుడూ పవర్ స్టారే!
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన 17 రోజుల షూటింగ్ మినహా, మొత్తం టాకీ పార్ట్ పూర్తి అయ్యింది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘OG’ సినిమాని అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడు పవన్ కళ్యాణ్..
ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాలు ఉంటాయి. నెలలో 15 రోజులు రాజకీయాల కోసం, మిగిలిన 15 రోజులు షూటింగ్ కోసం కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట. ‘హరిహర వీరమల్లు’ కూడా ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏ.ఎం. రత్నం కొడుకు జ్యోతి కృష్ణ.. సినిమాలో మిగిలిన పార్ట్‌కి డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడు.
జూలై, ఆగస్టు మాసాల్లో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తాడు పవన్ కళ్యాణ్. ఈలోపు కొత్త సినిమాలను కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం. రాజకీయాల్లో బిజీగా ఉన్నా, ఫ్యాన్స్ కోసం సినిమాలకు దూరం కాకూడదని అనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్. సినిమాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా ప్రజల కోసం, పార్టీ కోసం వాడాలని పవన్ అనుకుంటున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం..