Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవికి దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో చిరుకి ఈ గౌరవం దక్కింది. ఇంతకుముందు 2006లో దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి, 18 ఏళ్ల తర్వాత ‘పద్మ విభూషణ్’ సొంతం చేసుకున్నారు.
Trolls on Guntur Kaaram : అప్పుడేమో రొమాంటిక్ డ్యాన్స్.. ఇప్పుడేమో తల్లీ కొడుకులుగా..
చిరంజీవితో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటి, శాస్త్రీయ నృత్యకారిణి, పార్లమెంట్ సభ్యురాలు వైజయంతీమాలకు ‘పద్మ విభూషణ్’ అవార్డులు దక్కాయి. ఇప్పటిదాకా భారత సినీ చరిత్రలో ఆరుగురు నటీనటులు మాత్రమే ‘పద్మ విభూషణ్’ అవార్డులు దక్కాయి.
వీ. శాంతారం, జోహ్రా సెహ్‌గల్, అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, రజినీకాంత్ మాత్రమే సినీ రంగం నుంచి పద్మవిభూషణ్ అవార్డులు దక్కించుకున్నవారిగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏఎన్నాఆర్ తర్వాత పద్మవిభూషణ్ అవార్డు గెలిచిన రెండో తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి.. దక్షిణ భారతం నుంచి ఏఎన్నాఆర్, రజినీ తర్వాత ఈ పురస్కారం దక్కించుకున్న మూడో నటుడిగా నిలిచారు చిరు..
వైరల్ అవుతున్న CFO రింకూ పటేల్ హ్యాండ్ రైటింగ్ రిజైన్ లెటర్.. అందులో ఏముందంటే..