Oral Health : చాలామంది ముఖం అందంగా కనిపించడానికి తీసుకునే కేర్, పళ్ల విషయంలో తీసుకోరు. అందంగా కనిపించే కొందరు నోరు తెరిస్తే కంపు, నవ్వితే పాచి పళ్లతో అస్సలు చూడలేం. మనిషి ఆరోగ్యానికి పంటి ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా, అది పళ్ల కింద కలిగి, నోటి గుండా వెళ్లాల్సిందే.
Heatwave in India : మండే ఎండలు, వడ గాల్పులు.. ఈసారి వేసవి దంచికొడుతుందట..
పళ్ల గురించి సరైన కేర్ తీసుకోకపోతే నోటి దుర్వాసన రావడమే కాకుండా పిప్పి పళ్లు, చిగుర్ల సమస్యలు, చిన్న వయసులోనే పళ్లు ఊడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు నోరు మంచిగా లేకపోతే గుండె జబ్బులు, ఊపిరి తిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
రోజుకి రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం లేవగానే మీరు నచ్చిన ఓ పాట పెట్టుకుని, అది అయ్యేవరకూ బ్రెష్ చేయండి. అలాగే స్వీట్లు తిన్న తర్వాత నోటిని పుకిలించండి. తంబాకు, వక్కలు, సిగరెట్, బిడీ వంటి అలవాట్లు మానేస్తే మీకు, మీ పళ్లకి, మీ చుట్టూ ఉండే మాలాంటి వారికి మంచిది. చాలామంది పంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీని వల్ల పళ్లే కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సమస్య పెద్దది కాకముందే డెంటిస్ట్‌ని సంప్రదించడం మంచిది.