Operation Valentine : మెగా హీరోలందు వరుణ్ తేజ్ వేరయా! మొదటి సినిమా నుంచి దేనికదీ ప్రత్యేకంగా ఉండేలా సినిమాలు సెలక్ట్ చేసుకుంటున్నాడు వరుణ్. ఫ్లాపులు వచ్చినా సరే, రొటీన్ సినిమాలు మాత్రం చేయనని చెప్పేశాడు కూడా. తాజాగా వరుణ్ తేజ్ చేసిన మరో ప్రయోగం ‘ఆపరేషన్ వాలెంటైన్’.. మరి ఇదేనా వరుణ్‌కి సక్సెస్ ఇచ్చిందా…
Mahesh Babu PhonePe Ad: 5 సెకన్ల వాయిస్‌కి అన్నీ కోట్లా..! మహేష్ రేంజ్ చూస్తే మైండ్ బ్లాకే..
2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్, పాకిస్తాన్‌పై ఎయిర్ స్టైక్ చేసింది. ఇదే ఆపరేషన్ వాలెంటైన్.. ఈ స్ట్రైక్‌లో భారత ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్, పాకిస్తాన్ ఆర్మీకి చక్కడం, ఆ తర్వాత పెద్ద హైడ్రామా నడిచింది. ట్రైలర్ చూసి, ‘ఆపరేషన్ వాలెంటైన్’, అభినందన్ బయోపిక్ అనుకున్నారు కొంతమంది. అయితే ఇందులో అభినందన్ సీన్స్, ప్రస్తావన ఉండదు..
ఎయిర్ ఫోర్స్ చేసే యుద్ధ సన్నివేశాలను పర్ఫెక్ట్‌గా తెరకెక్కించిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా, మిగిలిన సీన్స్‌ని పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కవుట్ కాలేదు. ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ అయితేనే, దేశభక్తి సీన్స్ చూసినప్పుడు ఒళ్లు జలదరిస్తుంది. అది లేకపోవడం వల్లేనేమో, ‘ఆపరేషన్ వాలెంటైన్’ చూస్తుంటే ఓ ఎయిర్ ఫోర్స్ షో చూస్తున్నట్టుగా ఉంటుంది.
Jr NTR : దేవర వచ్చేది అప్పుడే! బన్నీని ఇబ్బంది పెట్టకుండా సైడ్ ఇచ్చిన తారక్..
లవ్ ట్రాక్ రాసుకున్నా, అది కూడా సరిగ్గా వర్కవుట్ కాలేదు. మిక్కీ జే మేయర్ మరోసారి తన మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ వేరే రేంజ్‌లో ఉంటుంది. మొత్తానికి వరుణ్ తేజ్ ఇంతకుముందు చేసిన ‘అంతరిక్షం’ మాదిరిగా ఇది కూడా విజువల్ ట్రీట్‌గా ఉన్నా, కాస్త ఎమోషన్స్ వర్కవుట్ అయ్యి ఉంటే సూపర్ హిట్టు బొమ్మగా నిలిచేది అనిపిస్తుంది..