Ooru Peru Bhairavakona Premieres Review : అప్పుడెప్పుడో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత క్లీన్ హిట్టు కొట్టలేకపోయిన సందీప్ కిషన్, గత ఏడాది ‘మైకేల్’ మూవీతో కేజీఎఫ్ లెవెల్ సక్సెస్ కోసం ట్రై చేసి చావు దెబ్బ తిన్నాడు. ఇప్పుడు ఆశలన్నీ ‘ఊరు పేరు భైరవకోన’ మీదే పెట్టుకున్నాడు సందీప్ కిషన్. వాలెంటైన్ డే సందర్భంగా రిలీజ్‌కి రెండు రోజుల ముందే ప్రీమియర్ షోస్ వేసింది చిత్ర యూనిట్..
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి ఫాంటసీ జోనర్‌లో వీఐ ఆనంద్‌కి మంచి పట్టు ఉంది. ఈసారి కూడా తన బలాన్ని నమ్ముకుని, ‘భైరవకోన’ను తీసుకొచ్చాడు ఆనంద్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రేంజ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ మాత్రం ఇందులో కుదర్లేదు. అయితే ఫాంటసీ సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ కచ్ఛితంగా నచ్చుతుంది.
ట్రైలర్‌లో చూపించినట్టే మహిమలు ఉన్న శివతాండవం అనే విలువైన రాయి ఉన్న దండం చుట్టే ఈ సినిమా కథ మొత్తం నడుస్తుంది. ఫస్టాఫ్‌లో ప్రేక్షకుల బుర్రలు ఎన్నో ప్రశ్నలు మెదిలేలా చేసిన వీఐ ఆనంద్, సెకండాఫ్‌లో ఒక్కో చిక్కుముడి విప్పుతూ వచ్చాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. అయితే క్లైమాక్స్ ట్విస్టును చాలామంది ముందుగానే ఊహించగలుగుతారు.. ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి ‘భైరవకోన’లో విజయం దక్కేలాగే ఉంది..
వైవా హర్ష, వెన్నల కిషోర్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. వర్ష బొల్లమ్మకి ఈ మూవీ బ్రేక్ ఇచ్చేలాగే కనిపిస్తోంది. కావ్య తాపర్ మరోసారి తన గ్లామర్ షోతో అలరించింది. శేఖర్ చంద్ర సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్లాయి. వీఎఫ్‌ఎక్స్ విలువలు కూడా బాగున్నాయి.. స్క్రీన్ ప్లే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ ఉంటే, థ్రిల్లింగ్ ఫీల్ కలిగేది. మొత్తానికి ఊరు పేరు భైరవకోన, ఫాంటసీ సినిమా ప్రియులకు పర్ఫెక్ట్‌గా, మిగిలిన వారికి సోసోగా అనిపిస్తుంది.