One Moment, One Life : అత్తింటి వేధింపులు తట్టుకోలేక గృహిణి ప్రాణాలు తీసుకోవడం, ఆర్థిక ఒత్తిడితో రైతు బలవన్మరణానికి పాల్పడటం, చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఉరేసుకోవడం. ప్రేమలో విఫలమై యువతీ యువకులు ఆత్మహత్య చేసుకోవడం. ఈ సంఘటనలు ఒకప్పుడు అరుదుగా ఉండేవి, ఇప్పుడు మన సమాజంలో రోజూవారీ వార్తలుగా మారిపోయాయి. ఇప్పుడు ఇంకొంత ముందుకు వెళ్లి మన డైలీ రొటీన్ లైఫ్ లో ఒత్తిడి వల్ల కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఎందుకు ఆత్మహత్యలు ఈ స్థాయిలో పెరిగాయి? మన ముందున్న ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నా, అందరి చేతుల్లో టెక్నాలజీ ఉన్నా, ఎందుకీ ఒత్తిడి, ఎందుకీ అసహనం? ఈ ప్రశ్నలకు సమాధానం సమాజంలో మార్పులు, మనసుల్లో పెరిగిన ఒత్తిడితో ముడిపడి ఉన్నాయి.
కష్టాన్ని ఎదుర్కోవడం ఎందుకు కష్టంగా మారింది :
గతంలో, ఇబ్బంఎప్పుడో దులు వచ్చినా, వసతులు లేకున్నా, సహనం వహిస్తూ ఆ కష్టాలను దాటుకొని ముందుకు సాగేవారు. ఇప్పటి తరంలో, ప్రతి సమస్యకు పరిష్కారం క్షణాల్లో సొంతం చేసుకోవచ్చు. కానీ ఈ సాంకేతికత, వేగం, అన్ని సౌకర్యాలు ఉన్నా, మనిషి ఒంటరితనాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమైంది.
Robot Suicide : పని భారం తట్టుకోలేక రోబో ఆత్మహత్య..
అసలు సమస్య ఏమిటంటే, తల్లిదండ్రులు పిల్లలకు కష్టమంటె ఏమిటో తెలియనివ్వకుండా పెంచడం, వారికి భయపెట్టే విధంగా చదువు మీద, వృత్తి మీద భారం వేయడం. పిల్లలు తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోవడం, ఫ్రెండ్స్ ముందు తక్కువగా భావించడం. ఈ భయాలు, అసహనాలు వారిని ఆత్మహత్య వైపు నెడుతున్నాయి.
చావు కాదు, బతికే మార్గాలు వెతుక్కోండి :
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని అందరూ చెప్తారు . కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు జీవితంలో ఎవరికైనా వస్తాయి, కానీ చావే దారి అనుకునే ముందు, బతికే మార్గాలను వెతకండి . ప్రాణం కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏమి లేదు.
ప్రతీ చావు వెనుక కనీసం 135 మంది ప్రభావితమవుతారని కేంటకీ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తేలింది. ఒక వ్యక్తి చావుకి కుటుంబమే కాక, స్నేహితులు, సమాజం అంతా బాద్యులే.
మనం ముందుకు సాగాలి :
బాధను భరించడం సులభం కాదు. కానీ మనకి కలిగిన బాధను ఇతరులతో పంచుకోగలిగితే, ఆ బాధను సగం తగ్గించవచ్చు ఎదురించే ధైర్యం.. సమస్యకి పరిష్కారం కూడా దొరకచ్చు, సమస్యల్ని రహస్యంగా ఉంచడం, ఏ ఒక్కరితోనూ పంచుకోకుండా ఉండటం మానసికంగా మరింత దెబ్బతిసేలా చేస్తుంది . ఎవరైనా నమ్మకమైన వారితో మాట్లాడడం చాలా అవసరం. సగటు సోషల్ మీడియా వాడకానికి కారణం కూడా అదే.. తమలో తమతో ఉన్న మాటలు, భావాలు వ్యక్తం చెయ్యడానికి ఎంచుకున్న ప్లాట్. వెతికితే దారులు చాలానే ఉన్నాయి వెతకాలి.
అంతేకాకుండా, ఏ సమస్యకి సొల్యూషన్ లేదనిపించినా, మీ కోసం ప్రత్యేకమైన సహాయసంస్థలు, హెల్ప్ లైన్లు ఉన్నాయి.
* 1800 4252900,
* 8142020033,
* 9493238208
* 1800 599 0019
* 09820466726
వన్ లైఫ్ ఫౌండేషన్: 7893078930
చైల్డ్ లైన్: 1098
ప్రతి ఒక్కరి బాధను తీర్చలేమేమో కానీ, ప్రతి ఒక్కరికీ ఓ మాట సాయం మాత్రం చెయ్యగలము. ఎవరైనా తమ కష్టాలను పంచుకుంటే, ఓపిగ్గా వినడం, వారితో సహనంగా మాట్లాడడం చాలా ముఖ్యం. “నువ్వు ఒంటరివి కాదు. నీకు నేను ఉన్నాను” అనే భరోసా ఇచ్చే మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు.
మీకోసం రాములమ్మ &టీమ్ కూడా ఉంది.