OMG 2 Telugu OTT : అప్పుడెప్పుడో వచ్చిన ‘Oh my God’ మూవీకి గత ఏడాది సీక్వెల్ వచ్చింది. ‘OMG 2’ పేరుతో వచ్చిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ దేవుడిగా కనిపిస్తే, పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాకి A సర్టిఫికెట్ రావడంతో థియేటర్లలో స్లో ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మౌత్ టాక్‌తో మెల్లిమెల్లిగా కలెక్షన్లు పెరిగి, బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. ఈ మూవీలో యామీ గౌతమ్ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినా, ఇది అందరూ ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు తప్పక చూడాల్సిన సినిమా..
భారతదేశంలో శృంగారం అంటే ఓ బూతు. పెళ్లి కాకుండా శృంగారం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. పెళ్లైనా కూడా బహిరంగంగా సెక్స్ గురించి మాట్లాడితే చాలా పెద్ద తప్పు చేసినట్టే చూస్తారు. హస్త ప్రయోగం చేయడం చాలా పెద్ద నేరం. ఇలాంటి అపోహల కారణంగానే భారత యువతకు సెక్స్ ఎడ్యూకేషన్ సరిగ్గా అందడం లేదు..
Summer Effect on Movies : కొత్త సినిమాలు లేవు..
స్కూల్లో సెక్స్ ఎడ్యూకేషన్ ఆవశ్యకతను వివరిస్తూ, రూపొందిన సినిమాయే ‘OMG 2’. ఈ మూవీలో దేవుడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు. భక్తుడి కోసం దేవుడు కదిలివస్తే, అన్నీ ఆయనే చూసుకుంటాడనేది మూర్ఖత్వం. అందుకే దేవుడు కదిలి వచ్చినా, కథను నడిపించేది మాత్రం ఓ సాధారణ భక్తుడే.. స్కూల్లో హస్త ప్రయోగం చేస్తూ దొరికిపోయిన కొడుకుకి న్యాయం చేసేందుకు ఓ తండ్రి చేసే పోరాటమే ‘OMG 2’..
సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినా ఇందులో అసభ్యకర సన్నివేశాలు కానీ, సెక్స్ సీన్స్ కానీ ఉండవు.. హస్త ప్రయోగం గురించి, సెక్స్ ఎడ్యూకేషన్ గురించి జరిగే చర్చ.. పిల్లలకు అనవసరం అని భావించి, సెన్సార్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో.. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో విడుదలైన ఈ సినిమా, జియో సినిమా ప్రైమ్‌లో తెలుగులో అందుబాటులోకి వచ్చింది.