Om Bheem Bush Review : ‘బ్రోచేవారెవరు రా’ మూవీ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ శ్రీవిష్ణు, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన సినిమా ‘ఓం భీమ్ బుష్’. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ అన్నింట్లోనూ వైవిధ్యం చూపించింది ఈ సినిమా యూనిట్. . ‘సామజవరగమన’ వంటి సూపర్ హిట్ తర్వాత శ్రీవిష్ణు చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి..
పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్స్ పొందిన ముగ్గురు యువకులు (బ్యాంగ్ బ్రదర్స్), భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ సైంటిస్టులుగా మారి, ఆ ఊరి జనాలను మోసం చేస్తూ ఉంటారు. అనుకోకుండా వీరికి ఓ పరీక్ష ఎదురవుతుంది. దెయ్యం ఉన్న మహల్‌లోకి నిధి కోసం వెళ్లిన బ్యాంగ్ బ్రదర్స్ తిరిగి వచ్చారా? ఇదే సింపుల్‌గా ‘ఓం భీమ్ బుష్’ కథ..
Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో 60 సినిమాలు..
టైటిల్‌లో ఉన్నట్టుగానే లాజిక్‌తో సంబంధం లేకుండా కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారు. హీరోయిన్లను ఎప్పటిలాగే గ్లామర్ కోసమే వాడుకున్నారు. అయితే కథ చాలా సింపుల్‌గా, తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులకు ముందే తెలిసిపోవడం ఈ సినిమాకి ప్రధాన మైనస్..
అదీకాకుండా ఈ టైపు కామెడీ, అందరికీ ఎక్కదు. మీమ్స్, సోషల్ మీడియా అవగాహన ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రం ‘ఓం భీమ్ బుష్’ కామెడీని చక్కగా ఎంజాయ్ చేస్తారు. వీటికి దూరంగా ఉండేవాళ్లకు ఇందులో కామెడీ సీన్స్ బోర్ కొట్టదు. మొత్తానికి శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చేసిన అల్లరికి పాస్ మార్కులైతే పడ్డాయి..