OG Vs Lucky Bhaskar : OGతో ఢీ కొంటున్న లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్‌కి షాక్ తప్పదా..

"OG" vs "Lakki Bhaskar": Clash of the Titans in September
"OG" vs "Lakki Bhaskar": Clash of the Titans in September

OG vs Lucky Bhaskar : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ మూవీకి క్రేజ్ మామూలుగా లేదు. ఈ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు.

‘OG’ మూవీలో పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన 14 రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉందని టాక్. అది పూర్తి అయితే గ్రాఫిక్స్, రీ-రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కావాల్సిన సమయం ఉంటుంది. కాబట్టే అన్నీ ఆలోచించే, 6 నెలల ముందుగానే ఆ డేట్ లాక్ చేసుకున్నాడు డైరెక్టర్ సుజిత్..

Balakrishna Gangs of Godavari event : అవన్నీ CG చేశారు, బాలయ్య అంజలిని తోయలేదు..

మరోవైపు ‘సార్’ తర్వాత వెంకీ అట్లూరీ చేస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 27నే రిలీజ్ కాబోతోంది.

సాధారణంగానే పవన్ కళ్యాణ‌్ సినిమాతో పోటీ పడి, సినిమాని రిలీజ్ చేయడం రిస్కు. అందులోనూ ‘OG’ మూవీకి వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అలాంటిది ‘OG’కి పోటీగా ‘లక్కీ భాస్కర్‌’ మూవీని దింపడం చాలా పెద్ద రిస్కే అవుతుంది..

సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయం ఉండడంతో సెప్టెంబర్‌లో ‘లక్కీ భాస్కర్’ ఓ వారం ముందుకి కానీ, లేదా ఓ వారం వెనక్కి కానీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ మూవీలో బిగ్ బాస్ ఫేస్ అయేషా ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.

Pawan Kalyan OG : ఆ ఇద్దరు హీరోలతో పోటీ పడుతున్న పవర్ స్టార్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post