NTR – Prabhas : ఆగస్టులో ఎన్టీఆర్-నీల్ సినిమా! మరి ‘సలార్ 2’ సంగతేంటి?

NTR – Prabhas : ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ బిజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్ 3’, ‘సలార్ 2’ సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రశాంత్ నీల్, త్వరలో ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభించబోతున్నాడు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి అణుబాంబు, న్యూక్లియర్ వార్ కాన్సెప్ట్‌తో ‘NTR-Neel’ సినిమా ఉండబోతుందని టాక్. దాదాపు 18 దేశాల్లో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 2024 నుంచి ఈ సినిమాని సెట్స్‌ మీదకి తీసుకెళ్లబోతున్నట్టుగా ప్రకటించింది చిత్ర యూనిట్..

Jr NTR Bollywood Movies : బాలీవుడ్‌లో పాగా వేస్తున్న ఎన్టీఆర్.. వార్ 2 తర్వాత హీరోగా మరో సినిమా..

ప్రస్తుతం కొరటాల శివతో ‘దేవర’ చేస్తున్న ఎన్టీఆర్, బాలీవుడ్‌లో హృతిక రోషన్‌తో ‘వార్’ మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్ సినిమాని స్టార్ట్ చేస్తాడు తారక్. తారక్ సినిమా షూటింగ్ అయ్యేసరికి ఏడాది, ఏడాదిన్నర పట్టొచ్చు. మరి ‘సలార్ 2’ సంగతి ఏంటి?

‘సలార్ 1’ మంచి సక్సెస్ అందుకుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ సినిమా బయ్యర్లకు కొన్ని ఏరియాల్లో అయినా లాభాలు తెచ్చిపెట్టింది.. అయితే ‘సలార్ 1’లో కథ లేదు, అసలు కథ అంతా ‘సలార్ 2’ మూవీలోనే ఉంది. ఈ సినిమా గురించి పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి కూడా చాలా గొప్పగా చెప్పారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందని అనుకుంటుంటే ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ సినిమాని లైన్ చేశాడు.

ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898AD’ సినిమా షూట్‌ని పూర్తి చేశాడు. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. అలాగే ‘కల్కి Part 2- 3102BC’ మూవీ ఉంది. మధ్యలో సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, హను రాఘవపూడితో ఓ లవ్ స్టోరీ ఉన్నాయి. ఈ సినిమాల కారణంగా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లే ‘సలార్ 2’ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post