NTR : ఎన్టీఆర్, టీనేజ్‌లోనే ఇండస్ట్రీ హిట్టు కొట్టిన తెలుగు హీరో.. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ టాప్ స్టార్‌గా సీనియర్లతో పోటీపడుతున్నప్పుడు మహేష్, అల్లు అర్జున్, ఆఖరికి పవన్ కళ్యాణ్‌కి కూడా పెద్దగా మాస్ మార్కెట్ లేదు. అయితే వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడిన ఎన్టీఆర్, ‘టెంపర్’ మూవీ నుంచి మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీకి ముందు వచ్చిన ‘రభస’, ఎన్టీఆర్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్…
అప్పటికి హిట్టు కొట్టిన దర్శకులతోనే వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఎన్టీఆర్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్‌తో ‘రామయ్య వస్తావయ్యా’, ‘సింహా’ తర్వాత బోయపాటి శ్రీనుతో ‘దమ్ము’ తీసిన తారక్, రామ్ పోతినేనితో ‘కందిరీగ’ మూవీతో హిట్టు కొట్టిన సంతోష్ శ్రీనివాస్‌తో ‘రభస’ చేశాడు..
వాస్తవానికి ‘కందిరీగ’ తర్వాత రామ్‌తోనే ‘రభస’ ప్లాన్ చేశాడు సంతోష్ శ్రీనివాస్. ‘కందిరీగ’ సినిమా ఎన్టీఆర్‌తో చేయాల్సింది. అలాగే సురేందర్ రెడ్డి చేసిన ‘ఊసరవెల్లి’ మూవీ, రామ్‌తో తీయాల్సింది. రామ్, తన దగ్గరికి వచ్చిన ‘ఊసరవెల్లి’ కథను ఎన్టీఆర్ దగ్గరికి పంపిస్తే, తారక్ చేయాల్సిన ‘కందిరీగ’ లోకి రామ్ వచ్చాడు. దీంతో ‘రభస’ మూవీని రామ్ రిజెక్ట్ చేయడంతో ఆ కథను తారక్‌కి చెప్పి ఒప్పించాడు సంతోష్ శ్రీనివాస్..
ఫస్టాఫ్, సెకండాఫ్‌లో సగం బాగానే ఉన్నా ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ దగ్గర్నుంచి కథ రసాభసాగా మారి, రచ్చ రచ్చ చేయడంతో బాక్సాఫీస్ దగ్గర ‘రభస’ డిజాస్టర్‌గా మారింది. ఈ మూవీ తర్వాత ఇలాంటి సినిమాలు చేస్తే, మేం మరోదారి చూసుకుంటామని ఎన్టీఆర్‌కి అభిమాన సంఘాల నాయకులు హెచ్చరికలు కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ ఫీలవుతున్నారనే విషయాన్ని గమనించిన ఎన్టీఆర్, ఇకపై కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడు..
చెప్పినట్టుగానే ‘టెంపర్’, ‘జనతా గ్యారేజ్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘RRR’ రూపంలో వరుస సక్సెస్‌లు అందుకున్నాడు ఎన్టీఆర్.. ‘రభస’ రిజెక్ట్ చేసిన రామ్ పోతినేని, ‘పండగ చేస్కో’ మూవీ చేసి హిట్టు కొట్టాడు. నాని చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ కూడా నాని రిజెక్ట్ చేసింది. అలాగే లేటెస్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘సీతా రామం’ మూవీ కూడా ముందుగా రామ్ దగ్గరికే వెళ్లింది. అయితే మాస్ సినిమాలు చేయాలని రామ్ ఫిక్స్ కావడంతో క్లాస్ స్టోరీని రిజెక్ట్ చేశాడు..