NTR and Lakshmi Parvathi : తెలుగునాట నటుడిగా, ముఖ్యమంత్రిగా కాకుండా చాలామందికి దేవుడిగా, ఇలవేల్పుగా మారిన నాయకుడు ఎన్టీ రామారావు. అలాంటి సమయంలో రామారావు చేసిన ఓ పని, ఆయన వీరాభిమానులకు కూడా నచ్చలేదు. 71 ఏళ్ల వయసులో అప్పటికే పెళ్లైన 38 ఏళ్ల లక్ష్మీపార్వతిని ఎన్టీ రామారావు రెండో వివాహం చేసుకున్నాడు. అసలు ఈ వివాహం వెనక ఏం జరిగింది.
1993, అక్టోబర్ 15న ‘ఇండియా టుడే’లో ప్రముఖ జర్నలిస్ట్ అమర్‌నాథ్ కె మీనన్, లక్ష్మీపార్వతి- ఎన్టీరామారావు వివాహం గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు.
ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..
‘‘నా 8 ఏళ్ల వయసులో ‘గులేబకావళి కథ’ మూవీ చూసినప్పుడు నాకు ఎన్టీ రామారావు అంటే ఇష్టం. మా ఇంట్లో పూజా మందిరంలో కూడా ఆయన ఫోటో ఉంటుంది..’’ ఎన్టీ రామారావుని కలిసినప్పుడు లక్ష్మీపార్వతి చెప్పిన మొదటి మాటలు ఇవే. ఎన్టీఆర్ ఆత్మకథ రాస్తానని ఆయన ఇంటికి చేరిన లక్ష్మీపార్వతి, ఆయనకు దగ్గరై రెండో భార్యగా మారింది.
ఎన్టీఆర్‌కి రెండో భార్యగా మారే సమయానికి లక్ష్మీపార్వతి వయసు 38 ఏళ్లు, ఎన్టీ రామారావు వయసు 71 ఏళ్లు. అప్పటికే వీరగంధం వెంకట సుబ్బారావు అనే వ్యక్తితో లక్ష్మీపార్వతికి వివాహం జరిగింది. లక్ష్మీపార్వతికి ఆమె మొదటి భర్తకి మధ్య కూడా 18 ఏళ్ల వ్యత్యాసం ఉంది. 56 ఏళ్ల వీరగంధం వెంకట సుబ్బారావుకి విడాకులు ఇచ్చి, 71 ఏళ్ల ఎన్టీ రామారావుకి రెండో భార్యగా మారింది లక్ష్మీ పార్వతి.
ఎన్టీఆర్- కృష్ణ మధ్య ఏం జరిగింది.. రామారావు సక్సెస్ చూసి తట్టుకోలేకనే..
అప్పటికే కాషాయ ధరించిన ఎన్టీ రామారావుని తన మాటలతో మురిపించి, తన సేవలతో దగ్గరై ఆయన మనసులో చోటు దక్కించుకుంది లక్ష్మీపార్వతి. అప్పటికే భార్య మరణం, కొడుకులు, కూతుళ్లు వేరు కాపురాలతో ఒంటరిగా బతుకుతున్న ఎన్టీ రామారావుకి లక్ష్మీపార్వతి తోడు నచ్చింది.
తనను పెళ్లాడాల్సిందిగా లక్ష్మీ పార్వతే, రామారావుని కోరింది. అయితే రామారావు అంత త్వరగా ఒప్పుకోలేదు. దీంతో జ్యోతిష్యుడితో చెప్పించింది. రామారావు జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవారు. దీంతో మీకు, లక్ష్మీపార్వతికి వివాహం అయితే లోక సంస్కరణ కోసం వీరభోగ వసంతరాయలు పుడతాడని జోస్యం చెప్పించింది. అప్పటికే జనాల పొగడ్తలు, దేవుడూ అంటూ అభిమానుల గోలలు చూసి తనను తాను కారణజన్ముడిగా ఊహించుకున్నారు రామారావు.
Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..
71 ఏళ్ల వయసులో పిల్లల పుట్టడం కష్టం. దీంతో తన స్నేహితుడైన డాక్టర్ అనిల్ కుమార్‌తో హార్మోన్ ఇంజక్షన్లు కూడా చేయించింది. అయితే వీటి కారణంగా పిల్లలు పుట్టకపోగా ఎన్టీ రామారావు ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈ సమయంలో పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలెట్టింది లక్ష్మీ పార్వతి. పార్టీలో అంతర్గత కలహాలు రాజేసింది.
ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి చేతుల్లో పావుగా మారిన విషయాన్ని పార్టీనేతలు గుర్తించారు. మొదట్లో ‘నా దైవం’ అంటూ కాళ్లకు మొక్కుతూ ఎన్టీఆర్ గడప తొక్కిన లక్ష్మీపార్వతి, పెళ్లి తర్వాత ‘ఏమయ్యో.. కాస్త ఉద్రేకం తగ్గించుకో.. నీకైదైనా అయితే చేయాల్సింది నేనే.. అంతా నేను చూసుకుంటా కదా..’ అంటూ ఆజమాయిషీ చేయడం మొదలెట్టింది.
లక్ష్మీపార్వతితో వివాహాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, పెళ్లి తర్వాత ఆమె ప్రవర్తన చూసి మరింత దూరమయ్యారు. లక్ష్మీపార్వతికి ఈర్ష్య బాగా ఎక్కువ. 4 కోట్ల మందికి ఆరాధ్య దైవంగా మారిన ఎన్టీఆర్‌ని వివాహం చేసుకునేందుకు ఎంతోమంది ఎదురుచూశారు. కానీ ఆ అదృష్టాన్ని ఆమె దక్కించుకుంది.
నాడు ఎన్టీఆర్, నేడు మెగాస్టార్, మరి రేపు..!?
ఎన్టీఆర్‌తో పొగడ్తలు అందుకున్న రేణుకా చౌదరి అంటే, లక్ష్మీపార్వతికి అస్సలు పడేది కాదు. అందుకే పక్కా ప్లానింగ్‌తో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది. ఇది పార్టీలో అంతర్గత పోరును రాజేసింది. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన మాట్లాడిన ప్రతీ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలో అన్నీ ఆమే నిర్ణయించింది. చివరికి ఎన్టీ రామారావు, ఆమె చేతుల్లో కీలు బొమ్మగా మారిన విషయాన్ని పార్టీ కార్యకర్తలే కాదు, ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన నాలాంటి జర్నలిస్టులు కూడా గుర్తించారు…’’ అంటూ రాసుకొచ్చారు అమర్‌నాథ్ కె మీనన్..
ఇదంతా చదివితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో చూపించినట్టుగా ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య జరిగింది, ఆర్జీవీ తీసింది అంతా వేరని తెలుస్తుంది.