No Christmas In Bethlehem : యేసు క్రీస్తు పుట్టిన రోజు క్రిస్‌మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ రంగురంగుల కాంతులతో, క్రిస్‌మస్ ట్రీలతో వెలుగులు వెదజిమ్ముతున్నాయి. అయితే యేసు పుట్టిన బెత్లెహంలో మాత్రం క్రిస్‌మస్ కాంతులు కనిపించడం లేదు. దీనికి కారణం పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధమే.
రిపబ్లిక్ వేడుకలకు హాజరు కానున్న ఫ్రెంచ్ ప్రెసిడెంట్..
క్రిస్‌మస్ వచ్చిందంటే బెత్లెహెం నిండా క్రైస్తవులతో నిండిపోయేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, యేసు జన్మదినాన ఆయన జన్మించిన ప్రదేశాన్ని సందర్శించుకోవడానికి వచ్చేవాళ్లు. అయితే పాలస్తీనా- ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో బెత్లెహెం బోసిపోయింది. ప్రస్తుతం బెత్లెహెంలో వెస్ట్ బ్యాంక్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్ సైన్యం ఆధీనంలో ఉన్నాయి.
చైనాలో భారీ భూకంపం.. 100కి పైగా మృతి..
గాజాలో ఇజ్రాయిల్ మిలిటరీ దాడులతో ఈ ఏడాది యేసు పుట్టిన ప్రాంతంలో, క్రిస్‌మస్ వేడుకలు జరగడం లేదు. ప్రతీయేటా ఈ సమయంలో లక్షల మంది పర్యాటకులతో నిండిపోయే ఈ ప్రదేశంలో కనీసం క్రిస్‌మస్ ట్రీస్ కూడా కనిపించడం లేదని క్రైస్తవులు బాధపడుతున్నారు.