నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ: ‘ఎక్స్‌ట్రా’ లేదు కానీ ‘ఆర్డినరీ’గానే ఉంది..

Extra Ordinary Man Movie Review

Extra Ordinary Man Movie Review : దాదాపు డజను సినిమాలు పోయినా, పట్టు వదలని విక్రమార్కుడిగా సినిమా తర్వాత సినిమా చేస్తూనే వచ్చాడు నితిన్. ఎట్టకేలకు ‘ఇష్క్‌’ తో కమ్‌బ్యాక్ ఇచ్చిన నితిన్, ‘భీష్మ’ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. ‘చెక్’, ‘రంగ్ దే’, ‘మాచర్ల నియోజిక వర్గం’ మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలాయి.

క్రియేటివిటీ లేనప్పుడే హింస, సెక్స్ వాడతారు.. వైరల్ అవుతున్న ఆమీర్ ఖాన్ కామెంట్లు..

2021 ఏడాదిలో 3 సినిమాలు రిలీజ్ చేసిన నితిన్, 2022లో ‘మాచర్ల నియోజిక వర్గం’ రిలీజ్ చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకుని ఈ ఏడాది ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీతో ముందుకు వచ్చాడు. ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ మూవీతో డైరెక్టర్‌గా మారిన స్టార్ రైటర్ వక్కంతం వంశీ, ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’కి దర్శకుడు.

Extra Ordinary Man Movie Review

ట్రైలర్‌ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా, క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుండడంతో ‘ఎక్స్‌ట్రా’కి మరింత బజ్ వచ్చింది. అయితే సినిమా కంటెంట్ మీద నమ్మకం లేకనో, లేక మరేదైనా కారణమో కానీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్‌కి కొన్ని గంటల ముందు నిర్వహించింది చిత్ర యూనిట్. ప్రీమియర్ షోస్ కూడా వేయలేదు.

ఈ ‘ప్రయాణం’ ఆగేదెప్పుడు? షమీని పెళ్లాడతానంది, ఇప్పుడేమో పఠాన్‌ని ప్రేమించానంటూ..

‘నా పేరు సూర్య’లో ఎమోషన్స్‌ ఓవర్ డోస్ కావడంతో ఈసారి కంప్లీట్ కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ రాసుకున్నాడు వక్కంతం వంశీ. ఫస్టాఫ్‌ పూర్తిగా కామెడీ, లవ్ ట్రాక్‌తో నింపేసి, మంచి మార్కులే కొట్టేశాడు. అయితే ‘నా పేరు సూర్య’ మూవీ మొదటి 40 నిమిషాల తర్వాత ట్రాక్ తప్పినట్టు.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ కూడా ఫస్టాఫ్ తర్వాత ‘ఎక్స్‌ట్రార్డినరీ’గా అనిపించదు.

సెకండాఫ్‌లో కథ, కథనం అన్నీ సాదాసీదాగా ఉండడంతో పాటు కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోలను ఇమిటేట్ చేస్తూ వచ్చే సీన్స్ కూడా చాలాసార్లు, చాలా హీరోలు వాడేశారు. శ్రీలీల గ్లామర్, రాజశేఖర్ క్యామియో, నితిన్ ఎనర్జీ సినిమాని చివరిదాకా మోసుకొచ్చాయి. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి మ్యూజిక్ అందించిన హారీశ్ జైరాజ్.. పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు.. తమిళ్‌లో హరీశ్ జైరాజ్‌కి సినిమాలు రావడం తగ్గిపోయింది. ఈ టైమ్‌లో అతన్ని తెలుగులోకి పట్టుకురావడం ‘ఎక్స్‌ట్రా’గానే అనిపిస్తుంది.

మొత్తంగా నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘ఎక్స్‌ట్రార్డినరీ’గా లేకపోయినా ఓ సారి చూడొచ్చనేలా ‘ఆర్డినరీ’గా ఉంది.

సినిమాల కోసం MBBS Examsకి డుమ్మా కొట్టిన శ్రీలీల.. సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలంటూ..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post