Ninda Movie Review : నో ‘హ్యాపీ’ డేస్..

Ninda Movie Review
Ninda Movie Review

Ninda Movie Review : హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో వరుసగా రెండు హిట్లు కొట్టాడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వరుస ఫెయిల్యూర్స్‌తో బిగ్ బాస్ టీవీ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్న వరుణ్ సందేశ్.. ‘చిత్రం చూడరా’ పేరుతో ఓ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు. తాజాగా వరుణ్ సందేశ్ నటించిన ‘నింద’ సినిమా థియేటర్లలోకి వచ్చింది.

Paruvu Web series Review : సగం సగం పనులన్నీ..

మానవ హక్కుల కమిషన్‌లో పని చేసే హీరో, తప్పుడు కేసుల్లో ఇరుక్కుని వారిని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే న్యాయమూర్తి అయిన తన తండ్రి, ఓ కేసులో సాక్ష్యాల ఆధారంగా ఓ అమాయకుడికి శిక్ష పడేలా చేశాడని తెలుసుకుంటాడు. అలా ‘నింద’ పడిన ఆ ముద్దాయిని హీరో ఎలా బయటికి తీసుకొచ్చాడు. ఆ కేసులో సృష్టించిన తప్పుడు సాక్ష్యాలను ఎలా మార్చాడు? ఇదే ‘నింద’ మూవీ కథ..

ఇలా తప్పుడు కేసు మోపబడి, శిక్ష అనుభవించేవారిని బయటికి తేవడం అనే కథలు కొత్తేమీ కాదు. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కథ చడవడానికి బాగున్నా, దాన్ని ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. రాజేశ్ జగన్నాథం దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా మారి ఈ సినిమాని తెరకెక్కించాడు. అన్ని విభాగాల్లో పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఎందులోనూ సక్సెస్ కాలేకపోయాడు. కథ సాగుతున్నా, చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందీ సినిమా..

Deputy CM Pawan Kalyan : బాలకృష్ణకు నచ్చడం లేదా..

సెకండాఫ్‌లో కాస్త థ్రిల్లింగ్ మూమెంట్స్ పెట్టినా, అవి కొద్దిసేపే. తనికెళ్ల భరణి, ఆనీ, భద్రం వంటి పరిచయం ఉన్న నటులు నటించడంతో నటనాపరంగా ఎలాంటి మైనస్ కనిపించదు. అయితే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కవుట్ కాలేదు. కేవలం ఓటీటీ డీల్ కోసం మాత్రమే థియేటర్లలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది ‘నింద’..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post