New Year 2024 : నూతన సంవత్సరం…. ఇప్పుడంటే ఈ పేరు వింటే వస్తుంది, పోతుంది లే అన్నట్టుంది కానీ… మా చిన్నప్పుడైతే అదొక పెద్ద పండుగ.
గ్రీటింగ్ కార్డ్స్.. లైఫ్ లో మనం అస్సలు మర్చిపోలేని వాటిలో ఇదొకటి! ఇప్పుడంటే ఎవరికైనా ఏ సెలబ్రేషన్ అయినా విష్ చేయాలంటే ఫోన్ కాల్, వాట్సప్ ద్వారా విష్ చేసేస్తున్నాం. కానీ అప్పట్లో డిసెంబర్ వచ్చిందంటే చాలు, ఎక్కడ చూసినా గ్రీటింగ్ కార్డ్స్ షాప్స్ ఉండేవి…
జైలు శిక్ష అనుభవిస్తూ పీజీలో గోల్డ్ మెడల్.. నీ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్..
న్యూ ఇయర్ దగ్గరకు వచ్చిందంటే నెల ముందు నుంచే దానికోసం ప్లాన్ చేసుకొని, పాకెట్ మనీ కోసం ఇంట్లో అమ్మ నాన్న దగ్గర ఏదో సాకు చెప్పేవాళ్లు.. అలా అడిగి, అలిగి మరీ తీసుకున్న డబ్బులతో కొందరు ఫ్రెండ్స్ బ్యాచ్‌ని వేసుకొని వెళ్లి, ఊర్లో ఉన్న అన్ని షాపులు తిరిగుతూ, అక్కడున్న గ్రీటింగ్స్ చూస్తే మైండ్ పోయేది…
మరి ముఖ్యంగా ఆ మ్యూజిక్ కార్డ్స్! ఓపెన్ చేయగానే మ్యూజిక్ ప్లే అయ్యేది. అప్పట్లో అదొక అద్భుతం. అది తీసుకోవాలని ఎంతో కోరికగా ఉన్నా, 50 రూపాయలంటే అమ్మో… అప్పట్లో మన దగ్గర అంత డబ్బు ఎక్కడిది.
చేతిలో ఉన్న బడ్జెట్‌కి తగ్గట్టు బెస్ట్ ఫ్రెండ్స్‌కి కొంచెం మంచి గ్రీటింగ్ కార్డ్స్ కొని, మిగతా ఫ్రెండ్స్‌కి నార్మల్ గ్రీటింగ్ కార్డ్స్ కొనేవాళ్లేం. అబ్బాయిలకైతే హీరో ఫొటోలు ఉన్న గ్రీటింగ్ కార్డ్స్, అమ్మాయిలకు అయితే హీరోయిన్ ఫొటోలు ఉన్న గ్రీటింగ్ కార్డ్స్, స్కూల్లో టీచర్స్‌కి ఫ్లవర్స్, కొటేషన్స్ ఉన్న గ్రీటింగ్స్ కొని ఇచ్చి తెగ మురిసిపోయే రోజులవి…
హద్దుల్లేని ప్రేమ.. ఆమె కోసం అతడిగా మారి.. చివరకు విషాదాంతమై..
ఆ గ్రీటింగ్స్ పెట్టడానికి, ఓ గ్రీటింగ్ కవర్స్ కొనడానికి మళ్లీ ఖర్చు ఎక్కువ అవుతుందని, బెస్ట్ ఫ్రెండ్‌కి, టీచర్స్‌కి మాత్రమే కవర్స్ కొని మిగతా వాళ్ళకి మాత్రం నోట్ బుక్ లో ఉండే పేపర్స్‌తో కవర్ రెడీ చేసి…. వాటి మీద మెరుపులు మెరుపుల పెన్నుతో పేర్లు రాసి పెట్టే రోజులు ఎంత మధురంగా ఉండేవి..
ఇక డిసెంబర్ 31న నైట్ అంతా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూడడంలో ఏదో తెలియని అనుభూతి. అందరికంటే ముందే లేచి రెడీ అయ్యి ఆ గ్రీటింగ్స్, కొన్ని ఆశ చాక్లెట్స్ పట్టుకొని సైకిల్ తొక్కుకుంటూ… ఆరోజు హాలిడే అయినా సరే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి వాళ్లకి గ్రీటింగ్స్, చాక్లెట్స్ పంచుతూ తిరగడం…. వాళ్ళిచ్చే కార్డ్స్ తీసుకోవడం తర్వాత బ్యాచ్ అందరం కలిసి ముందుగా ఫేవరెట్ టీచర్ ఇంటికి వెళ్లి సంబరపడిపోతూ మురిసిపోవడం… ఆ రోజులు మళ్లీ తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా…
అలవాటు నుంచి కల్చర్‌గా మరుతున్న స్మోకింగ్..
ఈ నెల రోజులు పోస్ట్‌మాన్ ఇంటికి వస్తున్నాడంటే ఎంత సంతోషమో… పోస్టులో వచ్చిన కార్డ్స్, ఫ్రెండ్స్ ఇచ్చిన కార్డ్స్ చూసుకుంటూ మురిసిపోవడం.. వాటిని జాగ్రత్తగా దాచుకోవడం… ఆ పాత రోజులే బాగుండేవి! సోషల్ మీడియా యుగంలో ఆ ఎదురుచూపులు లేవు, గ్రీటింగ్ కార్డులు లేవు, పోస్ట్ మ్యాన్ ఆచూకీ కనిపించడం లేదు..
ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది కాదనట్లా కానీ, ఎందుకో వాట్సప్‌లో పెట్టే టెస్ట్ మెసేజ్ కంటే… అప్పట్లో వాళ్లు మనకోసం కార్డు తీసుకొని, వాళ్లే మన కోసం స్వయంగా రాసిన కొన్ని మాటలు చదువుతూ ఉంటే ఏదో తెలియని ఆనందం… ఎప్పటికీ తిరిగి రాదేమో.. అలా ఒక్కసారి #90s లోకి వెళ్లి వచ్చాను, మీలో ఎంతమందికి నాలానే మీరు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయో ఒకసారి ఆ జ్ఞాపకాలనే గుర్తు చేసుకోండి.
అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు..