New Born Mom : గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీ జీవితంలోనూ అద్భుతమైన, ఆనందకరమైన సమయం. అయితే గర్భంతో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండే ఆడవాళ్లు.. డెలివరీ తర్వాత తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మానేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుంది. నిజానికి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కంటే డెలివరీ తర్వాతే బాలింతకే పౌష్టికాహారం ఎక్కువ ఇవ్వాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా, బలంగా మారతారు.
సాధారణంగా బాలింతల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, తేనే, బెల్లం, అలాగే రెగ్యులర్ గా చేసే బ్రేక్ ఫాస్ట్ కాకుండ రస్క్&బ్రెడ్ పాలు తీసుకోవాలి. పొద్దున్న 7 To 8 తినేయాలి. 12 To 1లోపు ఒక కప్పు రైసు ఒక చపాతి అందులో కూరలు కూడా ఏది పడితే అది కాకుండా బీరకాయ, తోటకూర, పాలకూర, పొట్లకాయ, దొండకాయ, ఇలా కొన్ని పద్యం కూరగాయలు మాత్రమే తినాలి.
సాయంత్రం 4కి డ్రై ఫ్రూట్స్ నువ్వుల ఉండలు పల్లీల లడ్డు ఇలాంటివి తీసుకోవాలి. నైట్ 7కి కచ్చితంగా డిన్నర్ రెండు చపాతీలు లేదా మినప్పిండి రొట్టె తీసుకోవాలి. నైట్ 9కి పసుపు, మిరియాల పాలు ఒక గ్లాసు తీసుకోవాలి. సొంటి పొడి వెల్లుల్లి ప్రతిరోజు ఏదో ఒక్కవిధంగా మీ ఆహారంలో తీసుకోవాలి. దోరగా పండడం, బప్పాయి తినడం వల్ల పాలు పుష్కలంగా పడతాయి.
Handloom Sarees : హ్యాండ్లూమ్ సారీస్ గురించి తెలుసా..!?
అలాగే చిన్న, చిన్న చేపలు పాలపరిగెలు అంటారు. వాటిని తినడం వల్ల కూడా పాలు పడతాయి. చికెన్, ఫిష్ ఏది కనీసం మూడు నెలల వరకు తినకూడదు. మటన్ లో కైమా వారంలో రెండు, మూడుసార్లు తిన్న మంచిదే. C సెక్షన్ అయిన వాళ్లకి కుట్లు తొందరగా మానిపోతాయి. డెలివరీ తర్వాత మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి.
Capgras Syndrome : కాప్గ్రాస్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా..!?
నరాలు ఎముకలు అన్ని వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. అలాగే మానసికంగా మరియు శారీరకంగా కూడా చాలా అలసటగా ఈ టైంలో రెస్ట్, మంచి ఫుడ్ చాలా అవసరం. మీరు పిల్లలకి పాలిస్తూ అలాగే కొన్నికొన్ని జాగ్రత్తలు, పౌష్టిక ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకుంటే మీరు మీ సంతానం ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉంటారు.