Natural Star Nani : నేచురల్ స్టార్ నాని, ‘సరిపోదా శనివారం’ తర్వాత వరుసగా మూడు సినిమాలు ఓకే చేశాడు. ‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో పాటు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. అలాగే సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా కూడా కన్ఫార్మ్ చేశాడు. అయితే వీటిల్లో శ్రీకాంత్ ఓదెల సినిమా మాత్రమే సెట్స్ మీదకి వెళ్లేలా ఉంది. మిగిలిన రెండు సినిమాలు, కొన్ని కారణాలతో ఆగిపోయినట్టు తెలుస్తోంది..
సుజిత్ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమా బడ్జెట్ రూ.100 కోట్లకు పైగా అవుతుండడంతో ఈ సినిమాని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల్, వేణు ఎల్లందు దర్శకత్వంలో చేయబోయే సినిమాలు దాదాపు ఒకే కథతో తెరకెక్కుతూ ఉండడంతో ‘ఎల్లమ్మ’ మూవీని సైడ్ చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో కథనాలు వినిపిస్తున్నాయి..
నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?
దీంతో ‘సరిపోదా శనివారం’ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు నాని… ‘హాయ్ నాన్న’ సినిమాకి సరైన థియేటర్లు దొరక్క, అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాల్లో రెండు ఆగిపోయాయి. దీంతో నాని సినిమాల విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని అంటున్నారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్..