Naseeruddin Shah : RRR, పుష్ప రెండు సినిమాలు చూడలేదు.. అలాంటి సినిమాల వల్ల లాభం ఏంటి..

Naseeruddin Shah : తెలుగులో వచ్చిన ‘RRR’ మూవీ, వరల్డ్ వైడ్ రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ఆస్కార్ అవార్డు గెలిచిన ‘RRR’ మూవీ, జాతీయ అవార్డులు కూడా కొల్లగొట్టింది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’, బాలీవుడ్‌లో సూపర్ హిట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమాకి అల్లు అర్జున్, నేషనల్ అవార్డు కూడా గెలిచాడు. అయితే ఈ రెండు సినిమాలపై సంచలన వ్యాఖ్యాలు చేశాడు బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దిన్ షా..

Murali Mohan : మనవాడికి నేషనల్ అవార్డు వస్తే, టాలీవుడ్ ఎందుకు సన్మానించలేదు..

‘నేను ఇంతవరకూ RRR, పుష్ప సినిమాలు చూడలేదు. నాకు చూడాలనే ఉద్దేశం కూడా లేదు. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల జనాలకు ఏం వస్తుందో కూడా నాకు అర్థం కాదు. అయితే మణిరత్నం సినిమాలు చూస్తాను. పొన్నియన్ సెల్వం కూడా చూశాను. ఎందుకంటే మణిరత్నం ఎలాంటి ఎజెండా లేకుండా సినిమాలు చేస్తాడు..’ అంటూ వ్యాఖ్యానించాడు నసీరుద్దీన్ షా..

డర్టీ పిక్చర్ వంటి సినిమాల్లో నటించిన నసీరుద్దీన్ షా, తెలుగు సినిమాల గురించి తక్కువగా మాట్లాడడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్థం పర్థం లేని బాలీవుడ్ సినిమాలు చేసే నసీరుద్దీన్ లాంటివాళ్లు, ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తున్న తెలుగు సినిమాలను చూసి తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post