Narendra Modi Biopic : మోదీ బయోపిక్‌లో కట్టప్ప! అంత లేదన్న సత్యరాజ్..

Narendra Modi Biopic : ఓ ఛాయ్ వాలా, భారతదేశానికి ప్రధాని అవుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందరికో నరేంద్ర మోదీ జీవితం స్ఫూర్తిదాయకం. ప్రజాసేవ కోసం భార్యను కూడా విడిచిపెట్టిన నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ బయోపిక్‌లో ‘కట్టప్ప’ సత్యరాజ్, మోదీ పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరిగింది.

తమిళ నటుడైన సత్యరాజ్, తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. మోదీ బయోపిక్‌ని తమిళంలో రూపొందించి, మిగిలిన భాషల్లోకి అనువదించబోతున్నారట. ఏ డైరెక్టర్ ఈ బయోపిక్ మూవీని రూపొందించబోతున్నాడు? నిర్మాత ఎవరు? వంటి విషయాలు ఇంకా తెలియరాలేదు.. అయితే సత్యరాజ్ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అలాంటి ఆఫర్ కూడా తనకు రాలేదని చెప్పాడు.

Kannappa Teaser : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీజర్.. జెట్ స్పీడ్‌తో వదులుతున్నారే..

ఇంతకుముందు 2019లోనే నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంలో ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో ఓ మూవీ వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్, మోదీ పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా, వచ్చిందీ కూడా జనాలకు తెలియలేదు. మోదీలా అచ్చుగుద్దినట్టు కనిపించడానికి వివేక్ ఓబెరాయ్ ఎంతగానో ప్రయత్నించినా, ఈ సినిమా విమర్శకులను కూడా మెప్పించలేకపోయింది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post