Nandamuri Prince : రామ్ పోతినేని హీరోగా మొట్టమొదటి సినిమా ‘దేవదాసు’. ఇలియానా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాతోనే.. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాసు’ సినిమా థియేటర్లలో 200 రోజులు ఆడింది. హీరోగా రామ్‌కి, హీరోయిన్గా ఇలియానాకి మంచి కెరీర్ నిలబడడానికి కారణమైంది. చక్రి మ్యూజిక్ అందించిన పాటలు, సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. అయితే ఈ సినిమా మొదటి నాలుగు వారాలు ఖాళీ థియేటర్లలో నడించిందని చెబుతున్నాడు డైరెక్టర్ వైవీఎస్ చౌదరి..
ఎన్టీ రామారావు మనవడు నందమూరి జానకి రామ్ కొడుకు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేయబోతున్నాడు వైవీఎస్ చైదరి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్లో స్టార్ హీరోగా ఉండగా ఇప్పుడు మూడో ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు. ఈ నందమూరి ప్రిన్ నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో తన సినిమాల గురించి మాట్లాడాడు డైరెక్టర్ వైవీఎస్ చౌదరి..
Pawan Kalyan : తనకు ఏమి చేయని ఇండస్ట్రీకి ఏమైనా చేస్తాడా..?
‘రామ్‌ని హీరోగా పరిచయం చేస్తూ దేవదాసు మూవీ చేశాను. మొదటి నాలుగు వారాలు, జనాలు థియేటర్ వైపు చూడలేదు. ఏం చేయాలి? ఆహో.. ఓహో.. సినిమా సూపర్, తెగ ఆడేస్తోందని ఫేక్ పబ్లిసిటీ చేశాం.. అది నమ్మి, జనాలు థియేటర్‌కి రావడం మొదలెట్టారు. అలా ఖాళీ థియేటర్లలో మొదలైన దేవదాసు 200 రోజులు ఆడింది.. ’ అంటూ చెప్పాడు వైవీఎస్ చౌదరి.. 2006లో విడుదలైన ‘దేవదాసు’ మూవీ, అప్పట్లో రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి, నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ తర్వాత బాలయ్యబాబుతో ‘ఒక్క మగాడు’ అంటూ, ‘భారతీయుడు’ సినిమాని రీమేక్ చేసి, ఆల్‌టైం డిజాస్టర్‌ని చేతిలో పెట్టాడు వైవీఎస్ చౌదరి..