Balakrishna Gangs of Godavari event : అవన్నీ CG చేశారు, బాలయ్య అంజలిని తోయలేదు..

Nandamuri BalakrishnaGangs of Godavari eventPre-release events
Nandamuri BalakrishnaGangs of Godavari eventPre-release events

Balakrishna :అవన్నీ CG చేశారు, బాలయ్య అంజలిని తోయలేదు..

బాలయ్య బాబుకి ఆవేశం ఎక్కువ. సెల్ఫీల కోసం మీద పడే అభిమానులపై చేయి చేసుకోవడం బాలకృష్ణకి బాగా అలవాటు. రాధికా ఆప్టే వంటి హీరోయిన్లు కూడా నందమూరి బాలకృష్ణ సెట్స్‌లో ప్రవర్తించే తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ‘Unstoppable’ ప్రోగ్రామ్‌తో తనపైన వచ్చిన నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చుకున్నాడు బాలయ్య. ఇన్నాళ్లు బాలకృష్ణను మనం తప్పుగా అర్థం చేసుకున్నామని అనుకునేలా చేశాడు. రీసెంట్‌గా బాలయ్య, వరుసగా ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు హాజరవుతున్నాడు. కాజల్ అగర్వాల్ పిలవగానే ‘సత్యభామ’ ఈవెంట్‌కి వెళ్లిన బాలకృష్ణ, విశ్వక్ సేన్‌ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ-ఈవెంట్ సమయంలో బాలయ్య కాళ్ల దగ్గర వాటర్ బాటిల్‌తో పాటు వీస్కీ కలిపిన మరో బాటిల్ ఉన్నట్టు లైవ్‌లో చూపించాడు ఓ కెమెరామెన్. అయితే అక్కడ ఏమీ లేదు, అంతా CG వర్క్ చేసిన జిమ్మిక్కు అంటున్నాడు నిర్మాత నాగవంశీ. ‘ఈవెంట్ చేసింది మేమే. ఈవెంట్ హాల్‌లోకి ఎలాంటి బాటిల్స్ అనుమతించలేదు. అలాంటప్పుడు అక్కడికి బాటిల్స్ ఎలా వస్తాయి. అది అంతా ఎవరో కావాలని CG చేశారు.

బాలకృష్ణగారు (Nandamuri Balakrishna), అంజలిని తోశారని రచ్చ చేస్తున్నారు. అంతకుముందు వీడియో, ఆ తర్వాత వీడియో చూడండి. ఏం జరిగిందో తెలుస్తుంది. మనం పక్కనున్న వాళ్లని కాస్త జరగమని చెబుతాం, వాళ్లకు వినబడకపోతే తట్టి చెబుతాం. బాలకృష్ణ గారు చేసింది అదే. దానికి బాలయ్య, అంజలిని తోసేశాడంటూ రచ్చ చేస్తున్నారు.. ముందు మొత్తం వీడియో చూడండి…’ ప్రెస్ కాన్పిరెన్స్‌లో అన్నాడు నిర్మాత నాగ వంశీ..

Vishwak Sen : ఇక ప్రయోగాలు చేయను, బాక్సాఫీస్‌ని తగలబెడతా..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post