Nagarjuna – Puri Jagannath : నాగర్జునని లైన్‌లో పెడుతున్న పూరీ.. హ్యాట్రిక్ కొడుతున్నామంటూ..

Nagarjuna – Puri Jagannath : టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌‌గా ఉన్న పూరీ జగన్నాథ్, ఏ హీరో ఛాన్స్ ఇస్తాడా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. వరుస ఫ్లాపులతో మహేష్‌తో చేయాల్సిన ‘జనగణమన’ సైడ్ అయ్యింది. ఈ మూవీని విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్నా అది కూడా వర్కవుట్ కాలేదు. ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత చేయాల్సిన విజయ్ దేవరకొండ కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఈ మూవీ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ మూవీని ఎలాగైనా పట్టాలు ఎక్కించాలని అనుకుంటున్నాడు…

మహేష్, విజయ్ దేవరకొండ హ్యాండ్ ఇవ్వడంతో ఈ సినిమాని ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జతో తెరకెక్కించాలని ప్రయత్నించాడు పూరీ జగన్నాథ్. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు సెలక్ట్ చేసుకునే తేజ సజ్జ కూడా పూరీతో సినిమా చేయడానికి నో చెప్పేశాడట. దీంతో నాగార్జునని ఒప్పించే పనిలో పడ్డాడు పూరీ జగన్నాథ్..

Kannappa Movie : కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదు! వేరే క్యారెక్టర్ నచ్చడంతో..

2003లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘శివమణి’ మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత రెండేళ్లకు ‘సూపర్’ అంటూ రాబరీ మూవీతో వచ్చారు ఈ ఇద్దరూ. ఈ సినిమాలోనే అనుష్క శెట్టి తొలిసారిగా హీరోయిన్‌గా మెరిసింది. ఈ రెండు సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి పని చేయలేదు. ఎట్టకేలకు పూరీ జగన్నాథ్-నాగార్జున కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కబోతుందని టాక్. వరుస ఫ్లాపుల తర్వాత గత సంక్రాంతికి ‘నా సామి రంగ’ సినిమాతో వచ్చి హిట్టు కొట్టాడు నాగార్జున..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘కుబేరా’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న అక్కినేని నాగార్జున, మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలోనూ నటిస్తున్నాడని టాక్ వినబడుతోంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post