నా సామి రంగ రివ్యూ : గత పదేళ్లలో అక్కినేని నాగార్జునకి వచ్చిన విజయాలు రెండే రెండు. ‘మనం’ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ మాత్రమే నాగ్‌కి దక్కిన విజయాలు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చి సక్సెస్ అయ్యాయి. దీంతో మరోసారి సంక్రాంతి బరిలో ‘నా సామి రంగ’ మూవీని నిలిపాడు అక్కినేని నాగార్జున.. మరి నాగ్‌కి ‘నా సామి రంగ’ సంక్రాంతి హ్యాట్రిక్ ఇచ్చాడా?
సైంధవ్ రివ్యూ: గురి సరిగ్గా కుదరని థ్రిల్లర్.. వెంకీ 75th మూవీకి అదే ప్లస్..
కిష్టయ్య (నాగార్జున), అదే ఊర్లో ఉండే వరలక్ష్మీ (అషికా రంగనాథ్)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. వీరి పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏంటి? కిష్టయ్య తమ్ముడు అంజి, అన్న కంటే ముందు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అంజి స్నేహితుడు రాజ్ భాస్కర్ ప్రేమకథ ఏంటి? ఇవన్నీ తెర మీద చూడాల్సిందే..
మలయాళంలో సూపర్ హిట్టైన ‘పొరింజు మరియమ్ జోష్’ మూవీని తెలుగులో రీమేక్ చేశాడు విజయ్ బిన్నీ. డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బిన్నీ, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే ఫస్టాఫ్ సోసోగా సాగిపోగా, సెకండాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఓవరాల్‌గా పండగకి పర్ఫెక్ట్ బొమ్మగా అనిపించినా..bకొన్ని ఎమోషనల్ సీన్స్‌ని టైట్ స్క్రీన్ ప్లేతో నడిపించకలేకపోవడంతో దర్శకుడి అనుభవలేమి కూడా కనిపిస్తుంది.
గుంటూరు కారం రివ్యూ : ఓన్లీ ఫర్ ఫ్యాన్స్.. మిగిలిన వాళ్లకి ఎక్కడం కష్టమే..
ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్, ‘నా సామి రంగ’ మూవీకి ప్రధాన బలం. అషికా రంఘనాథ్ గ్లామర్ ప్లస్ యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. అల్లరి నరేష్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించేశాడు. రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సర్ తమ పాత్రల్లో బాగా నటించారు.
సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అతి తక్కువ బిజినెస్ జరిగింది ‘నా సామి రంగ’ మూవీకే. కాబట్టి ఈ మూవీ సక్సెస్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే జనవరి 5 వరకూ ఈ మూవీ షూటింగ్ జరగడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం లేకపోవడం, కాస్త హడావుడిగా పని అయిపోగొట్టినట్టు అనిపిస్తుంది.. కుటుంబంతో కలిసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకునేవారికి ‘నా సామి రంగ’ పర్ఫెక్ట్ పండగ బొమ్మ.
హనుమాన్ మూవీ రివ్యూ: No words, Only Goosebumps.. కంటెంట్ ఉన్న కటౌట్..