Naga Chaitanya in Siddharth’s film : సిద్ధార్థ్ చేయాల్సిన సినిమాలోకి నాగచైతన్య! అక్కినేని ఫ్యామిలీకి అతిపెద్ద సర్‌ప్రైజ్‌గా…
టాలీవుడ్‌లో వచ్చిన గొప్ప సైన్స్ ఫిక్షనల్+ ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితం చేసిన సినిమాల్లో ‘మనం’ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2014, మే 23న విడుదలైన ‘మనం’ సినిమా, బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 6 సైమా అవార్డులు, 6 సంతోషం అవార్డులు, 5 సినీ‘మా’ అవార్డులు గెలుచుకుంది.
పునఃజన్మలు, మూడు తరాలు, మూడు భిన్నమైన కథలు, ఒక్క ఫ్యామిలీని కలుపుతూ ‘మనం’ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్. అప్పటికి ‘ఇష్టం’, ‘13బీ’, ‘ఇష్క్’ వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె.కుమార్.. హర్ష వర్థన్, కుమార్ సిద్ధార్థ రాసిన కథను అంతే అందంగా తెరకెక్కించిన విధానం, తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది..
నిజంగా ఈ సినిమాని దగ్గుబాటి వెంకటేశ్, సిద్ధార్థ్, డైరెక్టర్ కె విశ్వనాథ్‌లతో తెరకెక్కించాలని అనుకున్నాడట విక్రమ్. నాగార్జున చేసిన పాత్రను వెంకటేశ్, అక్కినేని నాగేశ్వరరావు చేసిన పాత్రను కె. విశ్వనాథ్, నాగచైతన్య (naga chiatanya)చేసిన పాత్రలో సిద్ధార్థ్‌ని అనుకున్నారట. అయితే అప్పటికి వరుస ఫ్లాపులతో సిద్ధార్థ్ మార్కెట్ బాగా దెబ్బ తినేసరికి, ఈ కథను ప్రొడ్యూస్ చేయడానికి సరైన నిర్మాతలు దొరకలేదు.
అలా అలా చేతులు మారుతూ అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి ఈ కథ వచ్చింది. కథకి బాగా ఇంప్రెస్ అయిన నాగార్జున, స్వయంగా ఈ సినిమాని నిర్మించాడు. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన మూడు తరాలు ఒకే తెర మీద కనిపించడం, అక్కినేని ఫ్యాన్స్‌కి కన్నుల పండగ…
మూడు తరాల హీరోలను ఒకే సినిమా చేసేలా ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఫ్యాన్స్‌తో పాటు మిగిలిన ఆడియెన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యేలా సినిమా తీయడమే కష్టం. అయితే విక్రమ్ కె. కుమార్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఎలాంటి కంఫ్యూజన్ లేకుండా సైన్స్‌ని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కలిపి ‘మనం’ సినిమా, ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.