Naga Babu : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రోజురోజుకీ కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఏపీలో దాదాపు పోలింగ్ ముగిసిన తర్వాత మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు వేసిన ఓ ట్వీట్, మెగా ఫ్యామిలీలో ఉన్న విభేదాలను బయటపెడుతోంది. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మా వాడే..’ అంటూ ఓ సూక్తిని ట్వీట్ చేశాడు నాగబాబు.. ప్రత్యేక్షంగా ఈ ట్వీట్ ఎవరి గురించి వేశాడు, ఎందుకు వేశాడనే విషయాలు చెప్పకపోయినా బన్నీ చేసిన పనికి మెగా ఫ్యామిలీ బాగా హార్ట్ అయ్యిందని తెలుస్తోంది..
AP Election 2024 : లైన్లో రమ్మన్నందుకు ఓటర్ని కొట్టిన ఎమ్మెల్యే, తిరిగిచ్చేసిన ఓటర్..
ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా బరిలో దిగింది. మెగా ఫ్యామిలీ అందరూ పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా నిలిచాడు. మెగాస్టార్ ప్రచారం చేయకపోయినా రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగబాబు ఇలా అందరూ జనసేన కోసం ప్రచారంలో పాల్గొన్నారు. అయితే మెగాస్టార్ బావ అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ మాత్రం జనసేన తరుపున కాకుండా నంద్యాల వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు..
తన స్నేహితుడి కోసం వచ్చానని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పినా… అల్లు అర్జున్, వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం అంటే.. ప్రత్యర్థికి పని చేయడమే! వైసీపీ కూడా బన్నీ మా పార్టీయే అంటూ పోస్టర్లు అతికించి, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో నాగబాబు వేసిన ట్వీట్, బన్నీ గురించే అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. కొన్నేళ్లుగా అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీతో అంటి ముట్టనట్టుగానే ఉంటున్నాడు. తాజాగా నాగబాబు వేసిన ట్వీట్‌తో మెగా ఫ్యామిలీలో విభేదాలు బయటికి వచ్చినట్టు అయ్యింది..