Nag Ashwin : నాగ్ అశ్విన్ తీసింది మూడంటే మూడు సినిమాలు. అయితే తన టాలెంట్ ఏంటో చెప్పడానికి రెండో సినిమా ‘మహానటి’ చాలు. తను ఏం చేయగలడో తెలుసుకోవడానికి మూడో సినిమా ‘కల్కి 2898AD’ చాలు. నాగ్ అశ్విన్, ఇప్పుడు ఇండియాలో టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయినట్టే. అయితే మిగిలిన డైరెక్టర్లకు, నాగ్ అశ్విన్‌కి ఓ విషయంలో చాలా వ్యత్యాసం ఉంది..
ఎస్.ఎస్. రాజమౌళి టేకింగ్ వేరే లెవెల్. కానీ జక్కన్న సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు, అక్కడక్కడా సందర్భాన్ని బట్టి శృంగారం ఉంటుంది. సుకుమార్ టెక్నికల్‌గా చాలా పెద్ద డైరెక్టర్. సుక్కూ సినిమాలో ఐటెం సాంగ్స్‌లో ఉండే బూతు భరించడం చాలా కష్టం.. శంకర్, మణిరత్నం లాంటివాళ్లు కూడా రొమాన్స్ విషయంలో ఓ వర్గాన్ని ఆకట్టుకునేలా సీన్స్ తీస్తారు..
సందీప్ రెడ్డి వంగా గురించి ఇక చెప్పాల్సిన పనే లేదు. పావు కిలో కంటెంట్‌కి, ముప్పావు కిలో రొమాన్స్, బూతులు, హింస జోడించి బిర్యానీ వండుతాడు సందీప్. ఆ బిర్యానీ టేస్ట్, ఎక్స్‌ట్రా మసాలా కోరుకునే వాళ్లకు బాగా నచ్చొచ్చు, కానీ అందరికీ ఎక్కదు.
Kalki 2898 AD Vs Mad Max : కల్కి చూడాలి అనుకునే వాళ్ళు, ఇది చదవకండి..
అయితే 3 గంటల సినిమాలో ఎక్కడా ఒక్క బూతు లేకుండా, ఎక్కడా అశ్లీలత, అసభ్యత లేకుండా సినిమాని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ఈ విషయంలో నాగ్ అశ్విన్‌కి గుడి కట్టాల్సిందే. ‘కల్కి 2898AD’ సినిమాలో పెట్టాలనుకుంటే చాలా చోట్ల ఇలాంటివి చేర్చొచ్చు. దిశా పటానీతో బికినీ వేయించి, మాస్ ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేయొచ్చు. ప్రభాస్, దిశా మధ్య రొమాంటిక్ సీన్స్ పెట్టి, C సెంటర్లలో టికెట్లు తెగేలా చేయొచ్చు..
కానీ నాగ్ అశ్విన్ మాత్రం కంటెంట్‌నే నమ్మాడు. తాను రాసుకున్న పాత్రను ఇలా కమర్షియల్ హంగుల కోసం ఎక్కువ తక్కువ చేయకుండా సినిమాని తీశాడు. బూతు, అశ్లీలత, అసభ్యత లేకుండా సినిమా తీసి సూపర్ హిట్టు కొట్టొచ్చని నిరూపించాడు.