Nag Ashwin : వైజయంతీ మూవీస్‌కి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల అనుభవం ఉంది. మూడు తరాల హీరోలతో సినిమాలు తీసిన వైజయంతీ మూవీస్‌కి ఈ మధ్య వరుస ఫ్లాపులు వచ్చాయి. ‘ఇంద్ర’ మూవీ తర్వాత ‘బాలు’, ‘సుభాష్ చంద్రబోస్’, ‘జై చిరంజీవ’, ‘సైనికుడు’ వంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ‘చిరుత’ కాస్త పర్వాలేదనిపించినా, మళ్లీ ‘కథానాయకుడు’, ‘కంత్రీ’ రూపంలో ఫ్లాపులు పడ్డాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘శక్తి’ సినిమాతో మెహర్ రమేశ్ పెద్ద రాడ్ దింపాడు. ఈ సినిమా దెబ్బకు వైజయంతీ మూవీస్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది.
దాదాపు ఏడేళ్ల తర్వాత ‘దేవదాస్’ సినిమా తీసినా అది పోయింది. ఇలా ఫ్లాపుల్లో ఉన్న సమయంలో వైజయంతీని ఆదుకున్నాడు నాగ్ అశ్విన్.. 2015లో వైజయంతీ నుంచి పుట్టిన ‘స్వప్నా సినిమా’ బ్యానర్‌లో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మాణ్యం’ మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ‘మహానటి’ పూర్వ వైభవం తెచ్చి పెట్టింది.
Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!
రెండు సినిమాలతో హిట్లు ఇచ్చిన నాగ్ అశ్విన్, నిర్మాతగా మారి ‘జాతిరత్నాలు’ తీసి మరో హిట్టు ఇచ్చాడు. అల్లుడిని నమ్మి, రూ.600 కోట్లు పెట్టాడు అశ్వినీదత్. అంత డబ్బు ఎందుకు పెట్టాడో నిరూపిస్తూ ‘కల్కి 2898AD’ మూవీ, అద్బుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి రోజే రూ.200 కోట్లు రాబడుతుందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా.. దీంతో ‘బాహుబలి2’ రికార్డులే ఇప్పుడు ‘కల్కి 2898’ ముందున్న టార్గెట్..