Music Shop Murthy Review : నాటక రంగం నుంచి సినిమాల్లోకి వెళ్లిన నటుల్లో అజయ్ ఘోష్ ఒకరు. ‘రంగస్థలం’, ‘మంగళవారం’ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఆమని, భాను చందర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి, బూతులు తిట్టమని ఓపెన్‌గా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు అజయ్ ఘోష్. మరి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కల నెరవేరింది..
Maharaja Movie Review : విజయ్ సేతుపతి విశ్వరూపం..
మొబైల్ యుగంలో ఆడియో క్యాసెట్లకు, సీడీలకు కాలం చెల్లింది.అయినా సరే మ్యూజిక్ షాప్ మూర్తి మాత్రం ఇప్పటికీ ఆడియో క్యాసెట్ షాప్‌ని నడిపిస్తూ ఉంటాడు. ఆదాయం లేక ఇబ్బందులు పడుతుండడంతో ఆ షాపు స్థానంలో సెల్‌ఫోన్ పెట్టుకోమని భార్య చెబుతూ ఉన్నా, మూర్తి పట్టించుకోడు. అలాంటి మూర్తి జీవితంలోకి అంజన వస్తుంది. ఆమె పరిచయం, మ్యూజిక్ షాప్ మూర్తికి కొత్త ఆలోచన రేకెత్తిస్తుంది. డీజే కావాలని ఆశపడతాడు. మరి 50 ఏళ్లు దాటేసిన మూర్తి కల నెరవేరిందా? ఇదే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమా కథ…
Harom Hara Movie Review: సుధీర్ బాబు మాస్ కమ్‌బ్యాక్..
సింపుల్ స్టోరీకి ఎమోషన్స్ జోడించి, కథను నడిపించడంలో దర్శకుడు శివ పాలడుగు సక్సెస్ అయ్యాడు. అజయ్ ఘోష్‌కి నటుడిగా ఇది చాలా పెద్ద అఛీవ్‌మెంట కిందే లెక్క. తన నటనతో సినిమాని మొత్తం లాక్కొచ్చేశాడు అజయ్ ఘోష్. ఇలాంటి సినిమాల్లో ట్విస్టులు, థ్రిల్స్ ఉండవు. సింపుల్‌గా సాగే ఎమోషనల్ డ్రామా. దానికి తగ్గట్టుగానే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా బాగుంది.. అయితే ఈ మూవీ రిలీజ్ అయినట్టే చాలా మందికి తెలీదు. కాబట్టి మ్యూజిక్ షాపు మూర్తి, జనాల్లోకి వెళ్లాలంటే ఏదైనా మ్యాజిక్ జరగాల్సిందే.