Munjya Movie Collections : బాక్సాఫీస్‌ని హడల్ ఎత్తిస్తున్న ‘ముంజ్య’..

Munjya Movie Collections
Munjya Movie Collections

Munjya Movie Collections : బాలీవుడ్‌లో ఓ చిన్న సినిమా, బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. పెద్దగా తెలియని ముఖాలు, క్రేజ్ లేని తారాగణం నటించిన ‘ముంజ్య’ మూవీ, జూన్ 7న విడుదలైంది. శర్వాణీ, అభయ్ శర్మ, మోనా సింగ్, సత్యరాజ్ వంటి నటీనటులు నటించిన ‘ముంజ్య’ సినిమాని ఆదిత్య సర్పోద్కర్ డైరెక్ట్ చేశాడు. హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ‘ముంజ్య’ మూవీ బడ్జెట్ రూ.12 కోట్లు మాత్రమే. ప్రమోషన్స్ కోసం మరో రూ.10 కోట్లు ఖర్చు చేశారు..

Ram Charan – Lakshmi Manchu : రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా మంచు లక్ష్మీ..

ఈ సినిమా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లు వసూలు చేసి, బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. 2024 ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో హిందీ చిత్రంగా నిలిచింది. మొదటి మూడు వారాలు, ‘ముంజ్య’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేకుండా సాగింది..

అయితే జూన్ 27న విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీ మెల్లిమెల్లిగా హిందీలో బంపర్ వసూళ్లు రాబడుతోంది. గురువారం విడుదలైన ‘కల్కి 2898AD’ సినిమా తొలి రోజు హిందీలో రూ.20 కోట్లు మాత్రమే రాగా, ఆదివారం జూన 30న రూ.40 కోట్లు వచ్చాయి. మౌత్ టాక్‌తో ఈ సినిమా మెల్లిమెల్లిగా వసూళ్లు పెంచుకుంటూ సాగుతోంది..

Kalki 2898 AD Vs Mad Max : కల్కి చూడాలి అనుకునే వాళ్ళు, ఇది చదవకండి..

‘కల్కి 2898AD’ కారణంగా ‘ముంజ్య’ సినిమా లాంగ్ రన్‌కి బ్రేకులు పడ్డాయి. జూన్ 28న ఈ సినిమాకి కేవలం రూ.76 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ ‘స్త్రీ’, వరుణ్ ధావన్ – కృతి సనన్ ‘బెడియా’ సినిమా యూనివర్స్‌లో వచ్చిన మూడో సినిమా ‘ముంజ్య’..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post