Mr Bachchan Review : హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా వచ్చిన మూడో సినిమా ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ, ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ గ్లామరస్ ఫోటోలను, పాటలను వాడిన డైరెక్టర్ హరీశ్ శంకర్, ప్రెస్ మీట్స్‌లో కౌంటర్లు వేస్తూ పీక్ పబ్లిసిటీ సంపాదించాడు. మరి బాలీవుడ్‌లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్‌గా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’.. హరీశ్ శంకర్ చెప్పినట్టు ఒరిజినల్‌ని మరిపించిందా?
అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అయిన హీరో, ఫస్టాఫ్ అంతా హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. తొలి సగంలో పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ మీదే ఫోకస్ పెట్టడంతో కథ ఉండదు. సెకండాఫ్ మొదలయ్యాక కానీ కథ ముందుకు సాగదు. ఫస్టాఫ్ కోసం ‘మిరపకాయ్’ మూవీలో హీరో రొమాంటిక్ యాంగిల్‌ని వాడిన హరీశ్ శంకర్, ‘రైడ్’ సినిమా స్టోరీని చెప్పడానికి చివరి 45 నిమిషాలు తీసుకున్నాడు. అయితే అసలు కథకి అదనంగా తన స్టైల్ మార్పులు, చేర్పులు చేసే ప్రయత్నం చేశాడు..
‘గబ్బర్ సింగ్’ మూవీలో వర్కవుట్ అయిన ఫార్ములా, ‘మిస్టర్ బచ్చన్’లో వర్కవుట్ కాలేదు. ‘రైడ్’ సినిమా ఇచ్చిన థ్రిల్‌ని అసలు టచ్ చేయలేకపోయాడు హరీశ్ శంకర్. రవితేజ తన ఎనర్జీతో సినిమాని లాగే ప్రయత్నం చేసినా… హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎక్కువ అటెన్షన్ కొట్టేసింది. మిక్కీ జే. మేయర్ మ్యూజిక్, పాటలతో సినిమాని కాపాడేందుకు ట్రై చేశాడు. అయితే ఒరిజినల్ కథకు తన స్టైల్‌లో అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్‌తో హరీశ్ శంకర్ న్యాయం చేయలేకపోయాడు. ఓవరాల్‌గా ‘మిస్టర్ బచ్చన్’ చూసినవాళ్లకి, కంటెంట్ లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనే సామెత గుర్తుకు వస్తుంది.. ‘రైడ్’ సినిమా చూడనివాళ్లకి ఈ మూవీ నచ్చే అవకాశాలు ఉన్నాయి..