Motherhood : చుట్టూ ప్రపంచం చూసి విస్తుపోయింది. విశాలమైన ఓటమి నిజాన్ని ఖూనీ చేసింది. అయినా ఆమె ఆగలేదు నిరంతరం వెతుకుతూనే ఉంది. ఆ వెతుకులాటలో ఆమెకు దొరికింది మాత్రం శూన్యం.
బతుకు బద్దలై బండలా మారిన హృదయం ఆమెది..
ప్రతిక్షణం గుర్తు చేస్తూనే ఉంది..
నువ్వూ ఓడిపోయావూ.. నువ్వూ ఓడిపోయావూ.. నువ్వూ ఓడిపోయావూ అని . .
Say No DP : సంస్కారం లేని టెక్నాలజీ..
ఈ ప్రపంచంలో తను ఒక చిన్న జీవి మాత్రమే, అయితే ఆ జీవికి బతికే స్వేచ్ఛలేదు..
బతకాలన్న కోరిక ఉండకూడదు, నిరంతరం వేరొకరి కోసం బతకడమే ఆమె జీవితం.. ప్రపంచం మారింది..
అభివృద్ధి పరుగులు తీస్తోంది..
ఇతర గ్రహంలో కూడా మానవుడు మరో ప్రపంచాన్ని ఏర్పరుచుకున్నాడు..
ఆమె జీవితం మాత్రం అలాగే ఉంది.. “ఎప్పటిలా ఇప్పటిలా”..
ఏం చేస్తాం… నేను చేశాను.. అమ్మ చేసింది.. మా అమ్మమ్మ చేసింది.. మా అమ్మకు అమ్మమ్మ చేసింది.. వాళ్ళ అమ్మకి అమ్మమ్మ చేసింది.. ఆఖరికీ ఆమే చేస్తూనే ఉంది, ఉంటుంది కూడా..!
అయినా ఆమెకు స్వార్థం లేదు పాపం..
ఆమె స్వార్ధంగా ఉండుంటే ఈ ప్రపంచం మరోలా ఉండేదేమో..
అవునూ.. ఆమె స్వార్థంగా ఉండుంటే..
ఈ అమ్మతనానికి ఇంత గొప్ప పీఠం చేసి కట్టబెట్టే వారు కాదేమో..
అవునూ.. అమ్మతనం, గొప్పతనం, ఆడతనం అని చెప్పి సంకెళ్ళు వేసి బందీగా చేసేవారు కాదేమో..
“పాపం..” అనవసరమైన పీఠాలు, అవసరమైన పీఠాలకు బలైంది మాత్రం “ఆమె మాత్రమే..”
పాలిచ్చే తల్లులు తీసుకువాల్సిన ఆహారం..