Money Heist Web Series : ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎల్లలు లేవు. అందుకే లోకల్ కంటెంట్‌తో పాటు గ్లోబల్ కంటెంట్‌కు ఆదరణ ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సీరీసుల్లో ‘మనీ హెయిస్ట్’ (Money Heist) ఒకటి స్పానిష్ (Spanish) లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ (Netflix) పుణ్యమా అని ఊహించని విధంగా అందరికీ ఫేవరెట్ అయ్యింది.
మనీ హెయిస్ట్ ఒరిజినల్ (స్పానిష్) టైటిల్ ‘లా కాసా డె పాపెల్’ (La casa de papel). బ్యాంకుల దోపిడీ (హెయిస్ట్) నేపథ్యంలో సాగే కథ ఈ సిరీస్‌ది. మంచి – చెడు అనేది చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. దొంగతనం నేరం. కానీ ఓ వ్యక్తి తన వారి కడుపు నింపడానికి గత్యంతరం లేక ఆ పని చేస్తే.. ఆ తప్పును కూడా సానుభూతితో చూసేవారు ఉంటారు. ‘మనీ హెయిస్ట్’ వెబ్ సీరిస్ ఈ పాయింట్ మీద నడుస్తోంది.
బెస్ట్ హాంకాంగ్ మూవీ షావోలిన్ సాకర్..
ఈ సిరీస్ స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ చెప్పే డైలాగులు ఫిలసాఫికల్ డెప్త్‌తో ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇన్‌వాల్వ్ అయ్యారంటే వదలకుండా చూస్తుంటారు.
ఓ సంవత్సరం క్రితం అనుకుంటా అందరూ Money Heist మేనియాలో ఉన్నప్పుడు, హా నా రేంజ్ కి Family Man, Suid Game లే ఎక్కువ అనుకోని వదిలేసా.
కానీ ఒక్కసారి స్టార్ట్ చేసాక.. ఒక్క పార్ట్ అయిపోగానే తిండి, నిద్ర మానేసి దానిమీదే పడిపోయాను. మైండ్ లో మొత్తం Professor, Raquel, Berlin, Tokyo, Nairobi ఇవే తిరుగుతున్నాయ్.
ఓ పెద్ద Robbery ని ఇన్వెస్టిగేట్ చేసే ఇన్స్పెక్టర్ ని ఓ Professor ప్రేమించడం ఏంటో..
ఆ పెద్ద Robbery కి Master Plan వేసిన ఈ Professor ని ఆ Inspector ప్రేమించడం ఏంటో..
వీళ్లిద్దరిని మనం ప్రేమిస్తూ..
ఎప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో.. అని వేయి కళ్ళతో మనం ఎదురు చూడ్డం ఎంటో..
అంతా Money Heist మాయలా ఉంటది..!
బాలకృష్ణ మూవీ షూటింగ్‌లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..
దోపిడీ సమయంలో ప్రేమలో పడకూడదు అంటారు కానీ అప్పటికే వాళ్ళందరితో మనం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయుంటాం.
వాళ్లంతా దొంగలు అన్న ఫీల్ మనకు ఎప్పుడూ రాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు, బంగారం కంటే మన విలువైన మనసులు దోచుకుంటారు. అందుకే వాళ్ళు నవ్వినప్పుడు మనం నవ్వుతాం.. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాం.. చివరకు వాళ్ళతో పాటు ఏడ్చేస్తాం..
Berlin మిగతా వాళ్లకోసం తన ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు..
Rio ని పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నప్పుడు..
Raquel ని Shoot చేసినప్పుడు Professor కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూసినప్పుడు..
Mascow చనిపోయినప్పుడు..
Nairobi ని ఓ పిచ్చినా కొడుకు చంపినప్పుడు..
అన్నిటికంటే ముఖ్యంగా TOKYO ఇంకాసేపట్లో చనిపోపోతుంది అని మనకు తెలిసినప్పుడు.. మనకు తెలీకుండానే కన్నీళ్లొచ్చేస్తాయ్..
Sai Pallavi : ఆ విషయంలో సాయిపల్లవి, నిజంగా హైబ్రీడ్ పిల్లే..
అదేంటో.. ఆ Professor ని ఎంతసేపు చూసినా అలానే చూడాలి అనిపిస్తుంది. ఏదో Magic ఉంది ఆయనలో.. కాసేపు ఆయనతో ఎవరు మాట్లాడినా ప్రేమలో పడిపోతారు ఆఖరికి పోలీసులతో సహా..
Tokyo.. ఈ Character గురించి ఏం చెప్పలేం ఆమెని చూడాలి అంతే.
తను చనిపోయినప్పుడు ఓ మాట అంటారు. “Tokyo కి స్వర్గంలో బోర్ కొట్టి చనిపోయింది” అని. దీన్నిబట్టి Risk తీసుకోవడం అంటే టోక్యోకి ఎంత ప్రేమో అర్థమవుతుంది.
TOKYO.. ఈ పేరులోనే ఏదో Energy ఉంది, Love ఉంది, Risk ఉంది, ఆ పేరులో ఇంకేదో తెలీని Emotional Feel ఉంది.
ఆమెను చూస్తూ.. LOVE YOU TOKYO అని ఎన్నిసార్లు అనుకుంటామో గుర్తే ఉండదు..
Say No DP : సంస్కారం లేని టెక్నాలజీ..
కొన్ని గుర్తుండిపోయే డైలాగ్స్..
* నిజానికి Accident అవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వదు. దాని చుట్టూ జనాలు గుమిగూడడం వల్ల అవుతుంది.
* నీ జీవితం అస్తవ్యస్తం అవుతే.. బాత్రూం లో ఉన్నా, దోపిడీలో ఉన్నా, జైల్ ఫ్రంట్ డోర్ ముందున్న ఏం తేడా ఉండదు.
* దోపిడీ సమయంలో ప్రేమలో పడకూడదు.
* మనం చూడలేనివి అనుకున్న దానికన్నా ఎక్కువ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
* మనం కనపడని దాని కోసం వెతుకుతాం.
ఏదైనా మనకు కనపలేదు అనుకోండి, దానికి మనం కనపడొచ్చు అన్నది మర్చిపోతాం, అది మనం సమస్యల్లో చిక్కుకున్నప్పుడు..
* బంగారం బతికుండి మనుషులు చనిపోయిన లిస్ట్ దురదృష్టవశాత్తు టోక్యో కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సీరీసుల్లో ‘మనీ హెయిస్ట్’ (Money Heist) ఒకటి.