Mohan Yadav as Chief Minister of Madhya Pradesh : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ.. గత కొన్నిరోజులుగా సీఎం పదవిపై కసరత్తు చేసింది. చివరగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సీఎం ఎంపికలో భాజపా (BJP) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
వచ్చే పదేళ్ళలో గౌతమ్ ఆదానీ ₹7 లక్షల కోట్ల భారీ పెట్టుబడి..
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ నేత, ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్ యాదవ్ (Mohan Yadav) ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ శాసనసభా పక్ష నేతగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా నరేంద్రసింగ్ తోమర్‌ను ఎంపిక చేశారు.
ధీరజ్ సాహు ఐటీ దాడులు: 318 కోట్ల నగదు పట్టివేత..
మధ్యప్రదేశ్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు ఉన్న మోహన్ యాదవ్ 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2013లో ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2020 జులై 2వ తేదీన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా, ఉన్నత విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.