Mohammad Shami : రాజకీయాల్లోకి మరో క్రికెటర్..

Mohammad Shami : క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం చాలా కామన్. ఇంతకుముందు మహ్మద్ అజారుద్దీన్, గౌతమ్ గంభీర్, మనోజ్ తివారి, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వంటి క్రికెటర్లు రాజకీయాల్లోకి వెళ్లారు, రాణిస్తున్నారు. ఇప్పుడు వీరి దారిలో భారత క్రికెటర్ మహ్మద్ షమీ కూడా నడవబోతున్నాడట..

Cadbury Chocolate : Cadbury ఆరోగ్యానికి మంచిది కాదు! బాంబ్ పేల్చిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ..

ఐసిసి వరల్డ్ కప్‌ 2023 టోర్నీలో 24 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, గాయం కారణంగా క్రికెట్‌కి దూరమయ్యాడు. అతని కాలికి ఆపరేషన్ కూడా అయ్యింది. గాయంతో ఐపిఎల్ 2024 ఆడడం కూడా అనుమానమే. అతన్ని లోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలని భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోందట.

పశ్చిమ బెంగాల్ నుంచి మహ్మద్ షమీని బీజెపి తరుపున పోటీ చేయాలని ఆ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారట. షమీకి జనాల్లో మంచి పేరు ఉంది కాబట్టి కరెక్టుగా ప్రచారం చేస్తే గెలవడం పెద్ద కష్టమేమీ కాదని కమలం పార్టీ ఆలోచన చేస్తోంది. ఇదే పార్టీ నుంచి పోటీ చేసి, గత ఎన్నికల్లో గెలిచిన గౌతమ్ గంభీర్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇకపై పాలిటిక్స్‌లో ఉండనని, క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలిపాడు.

The Danish Girl Movie Review : ది డానిష్ గర్ల్ మూవీ రివ్యూ..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post