Modi vs Advani : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణా అద్వానీ (ఎల్.కే. అద్వానీ)కి భారత ప్రభుత్వం, దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇస్తున్నట్టు ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒక్కడైన ఎల్.కే. అద్వానీ.. ఆర్‌ఎస్ఎస్ సభ్యుడిగానూ ఉన్నాడు. కేంద్ర మంత్రిగా సేవలు చేసిన అద్వానీ, 97 ఏళ్ల వయసులో భారత రత్న పురస్కారం అందుకున్నాడు.
2018లో త్రిపురలో బిప్లబ్ దేబ్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎల్.కే. అద్వానీ కూడా హాజరయ్యాడు. ఈ సభ మీదకి వస్తున్న సమయంలో మోదీకి చేతులు ఎత్తి నమస్కరిస్తూ విష్ చేశాడు అద్వానీ. అయితే నరేంద్ర మోదీ మాత్రం అద్వానీని పట్టించుకోకుండా ముందుకి వెళ్లిపోయాడు. మళ్లీ సభ దిగేటప్పుడు కూడా బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి నమస్కరించలేదు నరేంద్ర మోదీ.. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
ఈ సంఘటన కారణం అద్వానీ అభిమానులు, మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో చాలామంది నాయకులకు అద్వానీ గురువు. మోదీ కూడా అద్వానీ అండదండలతోనే నాయకుడిగా ఎదిగి, భారత ప్రధాని అయ్యారు. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో అద్వానీ, ఆయన అభిమానులను మక్కువ చేసుకునేందుకే ‘భారతరత్న’ పురస్కారం ఇచ్చినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
Sr NTR Vardhanthi : దేవుడిగా బతికి, ఒంటరిగా విడిచి.. ఎన్టీఆర్ ఆ తప్పు చేయకపోయి ఉంటే..