Modi Photo shoot in Lakshadweep : భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్ష్యదీప్‌లో చేసిన ఓ చిన్న ఫోటోషూట్.. ఓ దేశ ఆర్థిక పరిస్థితినే అయోమయంలో పడేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరేమో! జనవరి 4న భారత ప్రధాని మోదీ, లక్ష్యదీప్‌లో పర్యటించి అక్కడి బీచ్‌లో ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటోలతో ఒక్కసారి లక్ష్యదీప్ వర్సెస్ మాల్దీవుల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఈ చర్చలో మాల్దీవుల ప్రముఖులు తలదూర్చకున్నా, ఇది ఇంతటితో పోయేదేమో! కానీ లక్ష్యదీప్ని, మాల్దీవులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కొందరు మాల్దీవ్ మంత్రులు, భారత ప్రధాని గురించి వెటకారంగా ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లతో ఒక్కసారిగా దుమారం రేగింది..
‘My Country, My Priede’ పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది. దీంతో హాలీడేస్‌లో మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేసిన సెలబ్రిటీలు అందరూ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. మాల్దీవుల ప్రభుత్వంలోని మంత్రులే భారత ప్రధానిపై వ్యంగ్యంగా పోస్ట్ చేయడంతో ‘Easy my Trip’ కంపెనీ, మాల్దీవులకు వెళ్లే ఫ్లెయిట్ టికెట్ బుకింగ్స్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది.
భారత ప్రధానిని ట్రోల్ చేస్తూ ట్వీట్లు చేసిన ముగ్గురు మంత్రులను పదవిని తొలగిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటికే చాలా నష్టం జరిగింది. భారత క్రికెటర్లు, బాలీవుడ్, టాలీవుడ్ భామలు, ఆఖరికి టీవీ నటులు కూడా హాలీడేస్‌లో మాల్దీవులకి వెళ్లి, అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాళ్లు. ఇప్పుడు వారంతా ‘My Nation My Pride’ అంటూ లక్ష్యదీప్వైపు చూస్తున్నారు. ఈ వివాదం కారణంగా మాల్దీవులకు కొన్ని వందల కోట్ల నష్టం రాగా, లక్ష్యదీప్‌లో ఒక్కసారిగా టూరిస్టులు పెరుగుతున్నారు.
TSRTC free bus Effect : ఫ్రీ బస్సు తెచ్చిన తంటా.. 3 రోజులుగా తిండి తిప్పలు మానేసి..
ఇప్పుడు ఇంత రచ్చ జరిగాక మాల్దీవులకి వెళ్లడానికి, వెళ్లినా అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి భారత సెలబ్రిటీలు జంకడం ఖాయం. దీంతో ఆ రకంగా ఇన్నాళ్లు భారత టూరిస్టులతో కళకళలాడిన మాల్దీవుల టూరిస్ట్ హుండీ… ఇకపై వెలవెలపోనుంది..