Mirzapur 3 Review : మరీ అంత లేదు..

Mirzapur 3 Review
Mirzapur 3 Review

Mirzapur 3 Review : ఇండియాలో సూపర్ హిట్టైన వెబ్ సిరీసుల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. బండ బూతులు, వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రలతో వచ్చిన మొదటి రెండు సీజన్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జూలై 5న సీజన్ 3 విడుదలైంది. పంకజ్ త్రిపాఠి, ఆలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి నటించిన ఈ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్‌ని బాగా మిస్ అయ్యారు అభిమానులు..

సీజన్ 3లో గుడ్డూ పండిత్‌గా ఆలీ ఫజల్ అదరగొట్టేశాడు. మొదటి రెండు సీజన్లలో మున్నాభాయ్‌గా నటించిన దివ్యేందు, మిస్ కావడంతో ఆ ఛాన్స్‌ని బాగా వాడుకున్నాడు గుడ్డూ పండిత్. సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. మొదటి రెండు సీజన్లతో పోలిస్తే సీజన్ 3 కాస్త లాగినట్టుగా అనిపిస్తుంది. అదీకాకుండా పంకజ్ త్రిపాఠికి సీజన్ 3లో ఎక్కువ ప్రాధాన్యం దక్కలేదు..

Munjya Movie Collections : బాక్సాఫీస్‌ని హడల్ ఎత్తిస్తున్న ‘ముంజ్య’..

బీనా ఆంటీ రొమాన్స్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే మూడో సీజన్‌లో ఆ విషయంలో కూడా ఫ్యాన్స్ నిరాశ చెందారు… ‘మీర్జాపూర్’లో ఉండే డ్రామా, ఎమోషన్స్.. ఈ సీజన్‌లో మిస్ అయ్యాయి. అదీకాకుండా అనవసర సీన్ల కోసం మూడో సీజన్ వరకూ లాగినట్టుగా అనిపిస్తుంది. చాలా చోట్ల బోర్ కొట్టడం మొదలవుతుంది. కథ, కథనంలో కొత్తదనం ఏమీ ఉండదు.

ఫస్ట్ సీజన్‌ తర్వాత రెండో సీజన్ కోసం జనాలు బాగా ఎదురుచూశారు. కానీ రెండో సీజన్ తర్వాత మూడో సీజన్‌పైన అంత హైప్ రాలేదు. ఇక ఇప్పటితో ఈ సిరీస్‌ని ఆపేస్తేనే బెటర్.. ఇంకా లాగడం వల్ల జనాలకు అస్సలు ఎక్కకపోగా, ఓ సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ని ఫ్లాప్ సిరీస్‌గా మార్చినట్టు అవుతుంది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post