Mega Family vs Allu Family: అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య వైరం పెరుగుతూ పోతోంది. నంద్యాల నియోజికవర్గం విషయంలో మొదలైన రచ్చ, నాగబాబు ట్వీట్ మరింత పెరిగింది. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ (Allu Arjun)ను, ఆయన భార్య స్నేహారెడ్డిని అన్‌ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఉన్న విషయం కన్ఫార్మ్ అయిపోయింది. తాజాగా మెగా డాటర్ నిహారిక ఈ విషయంపై రియాక్ట్ అయ్యింది.
Allu Arjun Vs Mega Family : నాగబాబుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైబర్ అటాక్.. ట్విట్టర్ నుంచి అవుట్..
‘సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేశాడనే విషయం నాకు తెలీదు. అయితే ప్రతీదానికి ఓ కారణం ఉంటుంది. వాళ్లకు వాళ్లకు మధ్య సెపరేట్ కారణాలు ఉన్నాయి.. అన్నింటికీ రీజన్స్ ఉంటాయి..’ అంటూ కామెంట్ చేసింది నిహారిక కొణిదెల..
Mega Family : మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అల్లు ఫ్యామిలీ..
నిహారిక కామెంట్లతో మెగా ఫ్యామిలీ గొడవలు నిజమేనని తేలిపోయింది. మెగా కుటుంబం మొత్తం ఓ వైపు ఉంటే, అల్లు అర్జున్ ఓ వైపు వెళ్లిపోవడానికి కారణం ఓ ఎమ్మెల్యే సీటు విషయంలో జరిగిన గొడవేనట. అల్లు అర్జున్ తన స్నేహితుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ని కోరడం, దానికి జనసేన అధినేత ఒప్పుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తోంది.