Mega Family : తెలుగువాళ్లకు నమ్మకాలు చాలా ఎక్కువ. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. ఇప్పుడు మెగా కుటుంబంలోనూ ఈ మాట బాగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రాగానే ఐదుగురు మనవరాళ్లతో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, వరలక్ష్ములు అంటూ ట్వీట్ చేసింది ఉపాసన కొణిదెల…
Srimanthudu Controversy : మహేష్ ని కేసు నుంచి తప్పించిన నమ్రత..
మిగిలిన నలుగురు మనవరాళ్ల సంగతి ఎలా ఉన్నా, గత ఏడాది పుట్టిన క్లింకార గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. క్లింకార పుట్టిన తర్వాత తండ్రి రామ్ చరణ్‌కి ఆస్కార్ యాక్టర్ల డివిజన్ బెంచ్‌లో చోటు దక్కింది. అలాగే చిన్నాన్న వరుణ్ తేజ్‌కి పెళ్లి జరిగింది..
మామయ్య అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు దక్కింది. తాజాగా తాత చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కావడమే అంటూ కామెంట్లు చేస్తున్నారు మెగా వీరాభిమానులు. ఇప్పటిదాకా బాగానే ఉంది కానీ ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే, ఆ ఓటమిని చిన్నారికి అంటకడితే అస్సలు బాగోదు.. ఇంతకుముందు క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం కూడా.. లక్ష్మీదేవి పుట్టింది, లక్ తీసుకొచ్చిందనే సెంటిమెంట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Naga Chaitanya Thandel : ఆ రెండు సినిమాల్ని కలిపి కొడుతున్న చైతూ… తండేల్ వర్కవుట్ అయితేనా..