Mega Family : మెగా ఫ్యామిలీ.. ఈ ఫ్యామిలీ తెలియని వాళ్ళు ఇండియాలో అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది మెగా ఫ్యామిలీ. మెగా పవర్ స్టార్‌గా వచ్చిన రామ్ చరణ్, గ్లోబల్ స్టార్‌గా మారి ఆ పరిస్థితిని మార్చేశారు.
ఒకవైపు తండ్రి చిరంజీవికి విధేయుడుగా ఉంటూ, బాబాయ్ పవన్ కళ్యాణ్ మనస్తత్వం పునికిపుచ్చుకున్నాడు రామ్ చరణ్. మరి తండ్రి, బాబాయ్ రూటులో రామ్ చరణ్ కూడా త్వరలో రాజకీయంలో కూడా ముందడుగు వేస్తాడా అనే క్వశ్చన్ రాకపోలేదు.
ఎందుకంటే బిజెపికి దగ్గరగా ఉంటూ బాబాయ్ పవన్ కళ్యాణ్, రాజకీయ జీవితానికి తన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌కి రాజకీయ వారసుడు అంటూ ఎవరన్న ఉంటే అది రామ్ చరణే. పవన్ కళ్యాణ్ తర్వాత జనాల్లో ఆ స్థాయి క్రేజ్ చిక్కించుకుని సత్తా రామ్ చరణ్‌కి ఉంది.
Mega Family : లక్ష్మీదేవి పుట్టింది, లక్ తీసుకొచ్చింది.. పవన్ ఏపీ సీఎం కావడమే బాకీ..
ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్‌గా, పాన్ ఇండియా, పాన్ ఓల్డ్ స్టార్‌గా ఎదిగాడు. మేనమామ చిరంజీవి పేరు చెప్పుకుని, అందినంత వరకు అందిపుచ్చుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు తనది మెగా ఫ్యామిలీ కాదని తనని అలా పిలవద్దని, ఎన్నోసార్లు స్టేజ్ పైనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అంటూ చేసిన కామెంట్లు, తీవ్ర దుమారం రేపాయి. దీంతో మొత్తం మెగా ఫ్యాన్స్ అందరూ, అల్లు అర్జున్ దూరం పెట్టేశారు. అయితే అల్లు అర్జున్ ప్రయత్నాలు, విజయాలు ఆగలేదు. పుష్ప మూవీ నుంచి యావత్ సినీ ప్రపంచం, అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ‘పుష్ప: ది రూల్’ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే ఇక్కడ అర్థం కాని, మెగా ఫ్యాన్స్ అర్థం చేసుకోలేని విషయం ఏమిటంటే.. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా అల్లు ఫ్యామిలీ పాములు కదుపుతున్నారా? ఒకవేళ అది నిజం కాకపోతే, అల్లు వ్యాపారాల్లో మెగా ఫ్యామిలీ హడావుడి ఎందుకు లేదు?
అల్లు ఫ్యామిలీ నుంచి ‘ఆహా ’ ఓటీటీ ప్లాట్ ఫామ్ వచ్చింది. తెలుగు, తమిళ్ సినిమా హక్కులతో పాటు గీత ఆర్ట్స్‌లో వచ్చిన సినిమాలు, కొత్తగా వస్తున్న డైరెక్టర్లను, హీరోలను ప్రోత్సహిస్తోంది ‘ఆహా’.. అయితే ‘ఆహా’ యాప్‌లో జగన్‌కి వ్యతిరేకంగా కాని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్ధతుగా కానీ ఎలాంటి ప్రచారం జరగడం లేదు… రాజకీయాలకు అతీతంగా ఓటీటీని నడుతున్నారా? అంటే అలా కూడా కాదు..
Ram Charan : రామ్ చరణ్‌ని అవమానించిన షారుక్ ఖాన్..!
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ప్రోగ్రామ్ ‘Unstoppable’ ఆహా యాప్‌లో సూపర్ హిట్ అయ్యింది. ‘ఆహా’ యాప్ సక్సెస్‌కి ఈ ‘అన్‌స్టాపబుల్’ ప్రోగ్రామ్ కూడా కారణం. బాలయ్య కేవలం మెగా ఫ్యామిలీకి పోటీ అయిన నందమూరి ఫ్యామిలీ కుటుంబీకుడు మాత్రమే కాదు హిందూపురం MLA కూడా..
అలాగే తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బాలయ్య, అల్లు అరవింద్ బావ చిరంజీవిని, చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి విరుద్ధంగా ఎన్నోసార్లు కామెంట్లు చేశాడు కూడా.. అసలు అల్లు ఫ్యామిలీ స్కెచ్ ఏంటి? అడిగితే వ్యాపారం, వ్యాపారమే, బావ బావే అని కొట్టిపారేస్తారేమో! అయితే బావమరిది అల్లు అరవింద్, వ్యాపారం కోసం ఇన్ని చేస్తున్నా మెగాస్టార్ చిరంజీవి ఎందుకని సైలెంట్‌గా ఉంటున్నాడు? అనేది చాలామందికి అర్థం కాని విషయం. ఇది రాజకీయమా? లేక ఆర్థిక రాజకీయమా..!?