Meenakshi Chaudhary : అటు సీనియర్లు, ఇటు జూనియర్లను కవర్ చేస్తున్న మీనాక్షి చౌదరి..

Meenakshi Chaudhary : హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గుంటూర్ కారం’ మూవీలో మహేష్ బాబు మరదలిగా నటించింది మీనాక్షి చౌదరి. స్క్రీన్ స్పెస్ ఉన్నా, పాపను కేవలం మందు పోయడానికి, ఆమ్లేట్ వేయడానికి మాత్రమే వాడుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘గుంటూర్ కారం’ మూవీ మీనాక్షి చౌదరికి పెద్దగా హెల్ప్ కాకపోయినా ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా చేసే సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది మీనాక్షి చౌదరి.. అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేస్తోంది మీనాక్షి. అంతేకాదు దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్‌తో ‘మట్కా’ సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది మీనాక్షి చౌదరి.

Rajamouli : ఆ ఇద్దరితో ప్రేమదేశం తీయాలనుకున్నాడట..

వీటితో పాటు తలపతి విజయ్ ‘GOAT’, ఆ తర్వాత #Thalapathy69 సినిమాల్లోనూ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రస్తుతం ఇన్ని సినిమాలతో అటు సీనియర్లను, ఇటు జూనియర్లను కవర్ చేస్తున్న ఏకైక హీరోయిన్ మీనాక్షి చౌదరి… ఇంతకుముందు త్రిష, నయనతార, శ్రియ లాంటి హీరోయిన్లకు మాత్రమే ఒకేసారి అటు జూనియర్లు, ఇటు సీనియర్లతో ఒకేసారి నటించే అవకాశం దక్కింది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post