Mayuri Movie : ఫిల్మ్ ఫేర్ అవార్డులు, సైమా అవార్డుల కంటే రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులకు విలువ చాలా ఎక్కువ. ఎందుకంటే అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని, నంది అవార్డుల విజేతలను నిర్ణయిస్తారు జ్యూరీ సభ్యులు. కమర్షియల్‌గా సూపర్ సక్సెస్‌లు అందుకున్న హీరోలు, ఉత్తమ నటుడిగా నంది అవార్డు మాత్రం అందుకోలేకపోయారు. అయితే అత్యధిక నంది అవార్డులు గెలిచిన సినిమా ఏంటో తెలుసా?
Prabhas : హను ప్రేమ కథలో.. ప్రభాస్ జోడిగా మృణాల్ ఠాకూర్..
సింగితం శ్రీనివాస రావు దర్శకత్వంలో 1985లో తెరకెక్కిన ‘మయూరి’ సినిమా. క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ జీవిత కథ ఆధారంగా ‘మయూరి’ సినిమా తెరకెక్కింది. తనకి 16 ఏళ్ల వయసులో సుధా చంద్రన్‌కి రోడ్డు ప్రమాదంలో కాళ్లు చచ్చుబడిపోతాయి. అయితే పట్టుదలతో జైపూర్ కాళ్లు పెట్టుకుని, తిరిగి భరత నాట్యంలోకి రీఎంట్రీ ఇచ్చింది సుధా చంద్రన్..
1981లో సుధా చంద్రన్‌కి యాక్సిడెంట్ అయితే, 1984లో ‘మయూరి’ సినిమా విడుదలైంది. నృత్యకారిణిగా ఉన్న సుధా చంద్రన్‌ని సినిమాల్లోకి తీసుకొచ్చింది సింగీతం శ్రీనివాసరావే… రామోజీ రావు నిర్మాతగా తెరకెక్కిన ‘మయారి’ సినిమాలో వీరామాచినేని సుధాకర్, పీ.ఎల్. నారాయణ, నిర్మలమ్మయ, వై విజయ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకి మ్యూజిక్ అందించగా వేటూరి పాటలు రాశారు. ఆ ఏడాది రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో 14 విభాగాల్లో నందులు గెలిచి, అత్యధిక నంది అవార్డులు గెలిచిన చిత్రంగా నిలిచింది ‘మయూరి’. ఇప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంది.
TS to TG : TS కాదు, TG నెంబర్ ప్లేట్స్..
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సహాయ నటి (నిర్మలమ్మ), బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్, స్పెషల్ జ్యూరీ అవార్డులు, సెకండ్ బెస్ట్ స్టోరీ రైటర్ విభాగాల్లో నందులు గెలిచింది ‘మయూరీ’.