Matrimonial Frauds : భారతదేశంలో పెళ్లికి మించిన పెద్ద తంతు లేదు. పెళ్లికి జరిగే షాపింగ్, ఏర్పాట్లు, భోజనాలు.. ఇలా అప్పు చేసి అయినా సంబరంగా కళ్యాణ వేడుక చేస్తారు భారతీయులు. అందుకే ఈ పెళ్లి అనే కాన్సెప్ట్‌ని వాడుకుని పెద్ద మొత్తంలో మోసాలు జరుగుతున్నాయి. 20 ఏళ్లు దాటగానే అమ్మాయిలకు, 25 దాటగానే అబ్బాయిలకు ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘పెళ్లి ఎప్పుడు?’… ఎన్నికోట్ల ఆస్తులు సంపాదించినా పెళ్లి చేసుకోకపోతే లైఫ్ సెటిల్ కానట్లే చూస్తారు. అందుకే సొసైటీ కోసమైనా ఎలాగోలా పెళ్లి చేసుకోవాలని చూస్తారు చాలామంది.
ఇప్పుడు పెళ్లి అంటే వైభోగం కాదు, పెళ్లి అంటే జీవితంలో కలిసి నడిచే వేడుక కాదు. ‘సొసైటి సింబల్’… ఆ సింబల్, మనకి ఉంటేనే కుటుంబం.. ఆ సింబల్ ఉంటేనే ఆడకైనా, మగకైనా సొసైటీలో బతకడానికి స్టేటస్, రెస్పెక్ట్ దొరుకుతాయి. ఇదే అదునుగా ఎన్నో వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ వ్యాపారం వేల కోట్ల బిజనెస్‌గా ఎదిగింది. ఇది ఘరాన దొంగలకు ఘరానా ఆదాయం తెచ్చిపెట్టే ఘరానా బిజినెస్‌గా మారింది.
పెళ్లి పేరుతో జీవితాన్ని బేరం పెడుతున్నారా..!?
మిడిల్ క్లాస్ కుటుంబాల ఆశను ఆసరాగా చేసుకుని, ఆఫర్స్, డిస్కౌంట్ పేరుతో మోసం చేస్తున్నాయి మ్యాట్రిమోనీ సైట్స్. అలాగే ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల ద్వారా మోసపోయేవారి సంఖ్య కోట్లలో ఉంటోంది. సైట్లలో క్రేజీ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు అని తళుక్కుమనే వస్తువులను చూపిస్తారు. నమ్మి, వాటిని ఆర్డర్ చేశారో అంతే సంగతి. ఆర్డర్ చేసిన ఐటెమ్ ఎప్పుడు వస్తుందో తెలీదు. వచ్చినా, ఆర్డర్ చేసిన ఐటెంకి, వచ్చిన ఐటెంకి అస్సలు పొంతనే ఉండదు.
రిటర్న్ పాలసీ అని చెప్పినా, ఆ వెబ్ సైట్ నుంచి ఎలాంటి స్పందన రాదు. మోసపోయామని తెలిసి, గొల్లుమనడం తప్ప ఇంకేమీ మిగలదు. ఒకప్పుడు పెళ్లి అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవారు. ఇప్పుడు పేస్ కూడా చూడని ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్‌లో పరిచయాలతో ఫ్రీగా మోసపోతున్నారు. వీటికి తోడు మ్యాట్రిమోనీల వల్ల డబ్బులు ఇచ్చి మరి మోసపోతున్నారు.
ఆధునిక టెక్నాలజీ తో పాటు ఆధునిక మోసాలు కూడా. పెళ్లి కానీ అబ్బాయిలకు అమ్మాయాలను, పెళ్లి కానీ అమ్మాయిలకు హైఫై జీవితాన్ని ఎరగా చూపించి మోసలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ మోసాల వల్ల డబ్బుతో పాటు పరువు, మర్యాద, అన్నింటికంటే విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు.
గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే చాలు.. రోజూ మ్యారేజ్ వెబ్సైటులో కొత్త వధువర్లైపోతారు. కాబట్టి ఎటువంటి వ్యక్తిగత వెరిఫికేషన్ ఉండని సైట్ లతో జాగ్రత్త..