Masthu Shades Unnai Ra Review : ప్రతీ వారం హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడితే, ఈసారి మాత్రం ఇద్దరు కమెడియన్లు, తొలిసారి హీరోలుగా మారి థియేటర్లలోకి వచ్చారు. హర్ష ‘సుందరం మాస్టర్’ సినిమాతో వస్తే, అభినవ్ గోమఠం, ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా’ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీలో అభినవ్ చెప్పిన ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో.. హాట్ కమల్ హాసన్’ డైలాగ్ చాలా బాగా పేలింది. అందుకే ఇదే డైలాగ్‌ని మూవీ పేరుని పెట్టుకున్నాడు అభినవ్.
Sandeep Kishan : వాళ్లకి లైఫ్ ఇచ్చింది నేనే! కానీ నాకే బ్రేక్ రాలేదు..
పెయింటర్‌గా పనిచేసే మనోహర్‌కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే అప్పుల వల్ల పెళ్లి పీటల దాకా వచ్చిన సంబంధం క్యాన్సిల్ అవుతుంది. దీంతో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని, ఫ్లెక్స్ బిజినెస్‌లోకి దిగుతాడు. ఈ సమయంలో అతను ఓ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆ ప్రేమ వల్ల మనోహర్ పడిన కష్టాలు ఏంటి? చివరికి మనోహర్, తన ప్రేమను గెలిపించుకోగలిగాడా? ఇదే ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా’ సినిమా స్టోరీ లైన్..
పెద్దగా కథ లేకపోయినా సింపుల్ లైన్‌కి హ్యుమర్‌ని జోడించి, కామెడీతో నవ్వించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ కాస్త సాగినా, సెకండాఫ్‌లో కథ పరుగులు పెడుతుంది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కడం వల్ల అక్కడక్కడా ఆ ఎఫెక్ట్, స్క్రీన్ మీద కనిపిస్తుంది..
హీరో గోమఠం అభినవ్ తన స్టైల్ డైలాగ్ డెలివరీతో ఇరగదీసేశాడు. అలాగే హీరోయిన్ వైశాలి రాజ్, ఆలీ రాజా తదితర నటులు చక్కగా నటించారు. దర్శకుడు తిరుపతి రావు తన పనితనంతో ఆకట్టుకున్నాడు. తరుణ్ భాస్కర్ అతిథి పాత్రలో కనిపిస్తాడు. సంజీవ్ మ్యూజిక్, శామ్యూల్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.
Mahesh Babu : శ్రీమంతుడే కాదు.. మహర్షి కూడా నాదే..